సర్వేల్లో మోడీకి ముచ్చమటలు !

Monday, October 8th, 2018, 12:31:02 PM IST

దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనడానికి ఇప్పటికే పలు సంకేతాలు రాగా తాజాగా ఏవీపీ న్యూస్ సీ ఓటర్ సర్వేలో సైతం మోడీకి ప్రతికూల ఫలితాలే కనబడ్డాయి. దీంతో కమల దళంలో లోలోపల అలజడి మొదలైంది. ఈసారి ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కుతుందని రిజల్ట్స్ చెబుతున్నాయి.

రాజస్థాన్ లోని 200 అసెంబ్లీ స్థానాల్లో ఈ దఫా బీజేపీ కేవలం 56 సీట్లకే పరిమితమవుతుందని, కాంగ్రెస్ అనూహ్యంగా 140 కి పైగా స్థానాలని కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే 230 సీట్లున్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 122, బీజేపీకి 108 లభిస్తాయట. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే రెండు కీలక రాష్ట్రాలను బీజేపీ కోల్పోయినట్టే.
అదేమాదిరిగా

మహారాష్ట్ర, రాజస్థాన్ మాదిరిగానే చత్తీస్ ఘడ్ లో సైతం కాంగ్రెస్ అధికారాన్ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వే చెబుతోంది. మరి ఈ రిజల్ట్స్ ఫలితాల్ని బీజేపీ ఎలా అనజైల్ చేస్తుందో, మూడు రాష్ట్రాల్లో ఎలాంటి ఎన్నికల వ్యూహాన్ని అమలుచేస్తుందో చూడాలని అందరూ ఆసక్తికరంగా ఉన్నారు.