మూవీ రివ్యూ : “సూర్యకాంతం”

Friday, March 29th, 2019, 03:51:47 PM IST

మెగాకుటుంబం నుంచి వెండితెరకు పరిచయం అయిన నటులలో మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నిహారిక కూడా ఒకరు.తాను హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా నటన పరంగా నిహాకు మంచి మార్కులే పడ్డాయి.ఇప్పుడు మరో సారి తన అదృష్టం పరీక్షించుకోడానికి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో “సూర్యకాంతం”గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే సూర్యకాంతం(నిహారిక) ఎప్పుడూ హైపర్ యాక్టీవ్ గా ఉండే అల్లరి అమ్మాయి అభి(రాహుల్ విజయ్) అనే అబ్బాయితో ప్రేమలో ఉండగా తాను చివరి వరకు నిలదొక్కుకోలేననే భయంతో తానే దూరమయ్యిపోతుంది.ఈ నేపథ్యంలోనే అభికి పూజ(పేర్లెన్) తో ఎంగేజ్మెంట్ అవుతుంది అనగా..ఇక్కడే సూర్యకాంతం ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ మళ్ళీ అభి జీవితంలోకి ఎంటర్ అవుతుంది.ఒకే సమయంలో అభి ఈ ఇద్దరినీ ఎలా హ్యాండిల్ చేసాడు? ముగ్గురి మధ్యలో ఉన్న విభేదాలు ఏర్పడడానికి గల అసలు కారణం ఏమిటి? అభి జీవితంలోకి మళ్ళీ వచ్చిన నిహారిక అభిని దక్కించుకుందా లేదా అన్నది చూడాలంటే వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

దర్శకుడు ప్రణీత్ కి ఇది మొట్ట మొదటి సినిమాయే అయినా ముగ్గురి మధ్యలో సాగే త్రిముఖ ప్రేమ కథను చక్కగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి.అలాగే తాను రాసుకున్న పాత్రలను అనుకున్నది అనుకున్నట్టు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.కథానుసారం వచ్చే హాస్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.ఈ అన్నిటిలో దర్శకుడు మంచి మార్కులు సంపాదించాడని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వచినట్టైతే సూర్యకాంతంగా నిహారిక తన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేసారని చెప్పాలి,ఒక పక్క ఇన్నోసెంట్ గా కనిపించే సందర్భంలో చక్కగా సీరియస్ సన్నివేశాల్లో పూర్తి పరిణితితో నటించారు.అలాగే హాస్య సన్నివేశాలలో కూడా ఓ రేంజ్ పెర్ఫామెన్స్ చేసారు.అలాగే హీరో రాహుల్ విజయ్ కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలోనే ఉన్న మరో హీరోయిన్ పేర్లెన్ తన పాత్రకి తగ్గట్టుగా క్యూట్ గా మంచి నటన కనబర్చింది.

ప్లస్ పాయింట్స్ :

నిహారిక నటన
హాస్య సన్నివేశాలు
పాటలు

మైనస్ పాయింట్స్ :

ఎమోషన్స్ లో లోపం
సెకండాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే, సూర్యకాంతం అనే సినిమా ఒక సింపుల్ స్టోరీ లైన్ ను ఆధ్యంతం హాస్యభరితంగా దర్శకుడు తీర్చిదిద్దడానే చెప్పాలి,నిహారిక నటన మరియు ప్రధాన పాత్రధారుల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి.ముగ్గురి మధ్య కొనసాగే ఈ త్రిముఖ ప్రేమ కథ యువతను ఆకట్టుకుంటుంది.

Rating : 3/5