మహేష్ బాబుకు సికిందర్ చాలెంజ్..!

Tuesday, September 16th, 2014, 06:17:49 PM IST


ప్రపంచంలో ఐస్ బకెట్ చాలెంజ్ సూపర్ సక్సెస్ అయింది.. అలాగే మనదేశంలోఓ ప్రముఖ చానల్ జర్నలిస్ట్ రూపొందించిన రైస్ బకెట్ చాలెంజ్ ప్రచారం జోరుగా సాగుతున్నది… కాగ ఇప్పుడు తాజాగా.. మరో చాలెంజ్ పుట్టుకొచ్చింది.. అదే మై ట్రీ చాలెంజ్..దేశంలో పచ్చదనాన్ని పెంపొందించడమే ఈ చాలెంజ్ ముఖ్యఉద్దేశ్యం.. ఈ మై ట్రీ చాలెంజ్ ను ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి రూపొందించారు.. ఈ చాలెంజ్ ను రోపొందించిన మమ్ముట్టి.. ప్రముఖ నటులైన సూర్య, విజయ్ మరియు షారుఖ్ ఖాన్ లకు చాలెంజ్ విసిరారు.

మమ్ముట్టి విసిరిన సవాల్ ను సూర్య స్వీకరించి.. తానూ టాలివుడ్ నటుడు మహేష్ బాబు, కన్నడ నటుడు సుదీప్ మరియు బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ కు చాలెంజ్ విసిరారు. మొత్తానికి దేశంలో పచ్చదనం పెంపొందించేందుకు నటులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.. మార్గం ఏదైనా దేశం పచ్చగా ఉండటమే కావలసింది.