ఎన్టీఆర్ బయోపిక్ : ఎస్వీఆర్ అతనేనా..?

Tuesday, November 20th, 2018, 10:22:08 AM IST

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ సువీయ నిర్మాణంలో తన తండ్రి పాత్రలో నటిస్తుండగా దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా “ఎన్టీఆర్”, ఈ సినిమాను “ఎన్టీఆర్ కథానాయకుడు” మొదటి భాగంగాను, “ఎన్టీఆర్ మహానాయకుడు” రెండో భాగంగాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, రెండో భాగం షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో పాత్రల ఎంపిక కోసం చాలా కసరత్తు చేసాడు దర్శకుడు. అయినప్పటికీ ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర పోషించిన వారి పాత్రలను ఈ సినిమాలో చూపించలేకపోయారు.

సూర్యకాంతం లాంటి పాత్రలకు ప్రత్యామ్నాయం ఉండదు, ఎస్వీఆర్ పాత్ర కూడా అలాంటిదే. ఎన్టీఆర్ జీవితంలో ఎస్వీఆర్ డి కీలక పాత్ర, అలాంటి పాత్రను ఈ సినిమాలో కచ్చితంగా ఉంచాలని క్రిష్ చాలా ప్రయత్నించాడు. మొదట్లో మహానటిలో ఎస్వీఆర్ పాత్ర పోషించిన మోహన్ బాబును అనుకున్నా కూడా క్రిష్ అంతకంటే మంచి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించాడు.ఎట్టకేలకు క్రిష్ ప్రయత్నం ఫలించింది, ఎస్ వీ ఆర్ పాత్ర కోసం ఒక థియేటర్ ఆర్టిస్ట్ ను వెతికి పెట్టుకున్నారట. ఆటను అచ్చం ఎస్వీఆర్ ను పోలి ఉండటం విశేషం. ఇలాగే కొన్ని కీలక పాత్రల కోసం నాటక రంగ కళాకారులను ఎంపిక చేశారట. కాంతారావు పాత్ర కోసం కూడా థియేటర్ ఆర్టిస్ట్ నే ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పాతాళ భైరవి సంబందించిన సీన్లు షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం సంక్రాతి సందర్బంగా జనవరి 9న విడుదల కానుంది.