బీజేపీలో మరో యోగి?

Thursday, September 6th, 2018, 09:15:58 AM IST

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత జనతా పార్టీపై విమర్శల వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కూడా సరికొత్త ప్రణాళికలతో మళ్ళీ పుంజుకోవాలని చూస్తోంది. పార్టీని దేశమంతటా విస్తరించాలని బలం తక్కువగా ఉన్న చోట సరికొత్త నాయకులను రంగంలోకి దింపుతోంది. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు సాధించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే.

అనుభవం ఉన్న నాయకుల కన్నా ప్రజల నుంచి ఆదరణ పొందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న స్వామి పరిపూర్ణానందను కూడా బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తోంధనే వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పరిపూర్ణానంద నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. 55 రోజుల తరువాత మొన్ననే ఆయన మళ్ళీ నగరంలోకి అడుగుపెట్టగా భారత జనతా పార్టీ నేతలు ఘన స్వాగత పలికారు. దీంతో బీజేపీ లోకి మరో యోగి రానున్నారని టాక్ వస్తోంది. కథనాలు ఎన్ని వెలువడుతున్న కూడా ఇరు వర్గాల నుంచి ఎవరు కూడా ఏ విధంగాను స్పందించలేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments