తెలంగాణ‌లో బీజేపీకి అంత సీనెక్క‌డ‌?

Thursday, October 25th, 2018, 10:18:06 AM IST

ద‌క్షిణాదిలో జాతీయ పార్టీల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం వుండ‌ద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందులోనూ భార‌తీయ జ‌న‌తా పార్టీని అస‌లే న‌మ్మ‌రు. ద‌క్షిణాదిన త‌న ప్రాబ‌ల్యాన్ని చాటుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఈ పార్టీ అధినాయ‌క‌త్వ‌మే దానికి ప్ర‌తిబంధ‌కంగా ప‌రిణ‌మిస్తున్నారు. తెలంగాణ‌లో త‌మ పార్టీని రేసులో నిల‌ప‌డం కోసం చివ‌రికి స‌ర్వ‌సంగ ప‌రిత్యాగి అయిన‌టువంటి ప‌రిపూర్ణానంద‌ను లైన్‌లోకి తీసుకొచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకునేలా చేసింది. నెల్లూరుకు చెందిన ప‌రిపూర్ణానంద స్వామిని తెలంగాణ‌కు తీసుకుని రావ‌డం వ‌ల్ల బీజేపీకి క‌లిగే లాభం ఏంట‌నేది బీజేపీ శ్రేణుల‌కు మింగుడుప‌డ‌టం లేదు.

ఎన్నో ఏళ్లుగా పార్టీని జ‌ల‌గ‌ళ్లా ప‌ట్టుకు వేళ్ల‌డుతున్న మా ప‌రిస్థితి ఏమిటి అని వాపోతున్నారు. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను ప్ర‌క‌టించి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న టీఆర్ ఎస్ 105 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి ప్ర‌చార ప‌ర్వాన్ని హీటెక్కించింది. టీఆర్ ఎస్ త‌ర‌హాలోనే తామూ దూకుడుగానే వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌మ‌ని చెప్పుకునే క్ర‌మంలో బీజేపీ తొలి జాబితాగా 38 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించింది. ఇదే బీజేపీలో సైలెంట్ గా అస‌మ్మ‌తి రాజుకునేందుకు కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌క‌టించిన జాబితాలో అధిక శాతం అంటే 20 మంది ఇత‌ర పార్టీల నుంచి టికెట్ రాక‌పోవ‌డంతో బీజేపీ లోకి జంప్ అయిన జీలానీలే వుండ‌టం పార్టీ క్యాడ‌ర్‌కు న‌చ్చ‌డం లేదు. దీంతో బీజేపీ చెబుతోందొక‌టి, చేస్తోందొక‌ట‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

పైగా పార్టీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఓ నియోజ‌క వ‌ర్గంలో తండ్రీ కొడుకుల‌కు టికెట్లు కేటాయించారు. ఇదీ ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ‌లో మేమే అధికారంలోకి వ‌స్తామంటే మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న బీజేపీ అధినాయ‌క‌త్వానికి ఇక్క‌డ స‌రైన నాయ‌క‌గ‌ణం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. నాయ‌కులే లేకుండా బీజేపీ అధికారంలోకి ఎలా వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు. దేశాన్ని అన్నిరంగాల్లోనూ భ్ర‌ష్టు ప‌ట్టంచిన బీజేపీకి మ‌రో 30 ఏళ్ల పాటు సౌత్‌లో అధికారం చూడ‌టం క‌ళ్లేన‌ని విశ్లేషిస్తున్నారు. ఇక సాములోరిని తెచ్చాక పార్టీలో ఇన్న‌ర్‌గా త‌న్నుకు చావ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments