కంచె X స్వామి..ఇప్పుడిది చాలా హాట్..!

Saturday, September 23rd, 2017, 07:45:09 PM IST

‘సామజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తక ఆవిష్కరణ తరువాత సామజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయారు. ఏపీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు తెలంగాణ నుంచి హరీష్ రావు లు ఐలయ్యపై విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నా ఆయన మాత్రం తగ్గడం లేదు. ఓ టివి చర్చ కార్యక్రమంలో ఐలయ్య, స్వామి పరిపూర్ణానంద ల మధ్య జరిగిన సంభాషణ హాట్ టాపిక్ గా మారింది.

ఎప్పుడూ ఓపిక వహించే స్వామి పరిపూర్ణానంద ఐలయ్యతో చర్చ జరిగే సమయంలో సహనం కోల్పోయారు. ఆయన ఐలయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు క్రిస్టియన్ వాదివి, అందుకే నీ పేరు చివర పేషర్డ్ అని పెట్టుకున్నావు అని స్వామి అన్నారు. ఐలయ్య మాట్లాడుతూ అది నా అస్తిత్వం, తాను కూర్మ కుటుంబంలో జన్మించాను కనుక చివర అలా పెట్టుకున్నాను. విదేశాల్లో వృత్తులను బట్టి పేర్లు పెట్టుకునే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. హరీ పోటర్ అనే పేరు కూడా అలాగే వచ్చిందని ఐలయ్య తెలిపారు. తన వివరాలు అడిగారు కాబట్టి మీ తల్లి దండ్రులు ఎవరు అని ఐలయ్య స్వామిని ప్రశ్నించారు. దీనితో అవమానంగా భావించిన పరిపూర్ణానంద స్వామి ఆగ్రహంతో చర్చ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. లక్ష కోట్లు ఇస్తే ఏమైనా చేస్తానని తెలివైన కంచె ఐలయ్య వంటి దేశ ద్రోహులను ప్రోత్సహించడం తగదని స్వామి పరిపూర్ణానంద అన్నారు. దేవి నవరాత్రుల తరువాత ఈ వ్యవహారంపై తన కార్యాచరణని ప్రకటిస్తానని పరిపూర్ణానంద తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments