“సైరా” పై అంచనాలు చెక్కు చెదరలేదు..!

Tuesday, February 12th, 2019, 09:20:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం “సైరా”.ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి అంచనాలకు మించే తెరకెక్కిస్తున్నారని ఇప్పుడు సినీ వర్గాల నుంచి సమాచారం.కానీ ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమి లేకపోవడంతో మన దగ్గర ఈ సినిమాకి పెద్దగా బజ్ లేదని అందరు అనుకుంటున్నా ఈ తరుణంలో ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూసేందుకు ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారట.

తెలుగు నెలకి చెందిన మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అయితే ఈ సినిమా మొదలు పెట్టిన మొదట్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.కానీ క్రమేపి పెద్దగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ సినిమాని తక్కువ అంచనా వేస్తున్నారా అన్న అనుమానం కలిగింది.కానీ పలు సర్వేలలో తేలింది ఏమిటంటే ఎలాంటి అప్డేట్లు లేకపోయినా సరే మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపైనే అధికంగా ఆసక్తిని కనబరుస్తున్నారు.దీన్ని బట్టి “సైరా” పై అంచనాలు ఎక్కడా చెక్కు చెదరకుండా పదిలంగానే ఉన్నాయనే చెప్పాలి.