టీ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ఆయ‌నేన‌ట‌!?

Thursday, November 8th, 2018, 10:06:37 AM IST

గులాబీ బాస్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్ప‌డిన మ‌హాకూట‌మి సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో తాత్సారం చేస్తుండ‌టం కాంగ్రెస్ శ్రేణుల్లో అస‌హ‌నాన్ని క‌లిగిస్తోంది. సీట్ల స‌ర్దుబాటు పూర్త‌యింద‌ని ఒక రోజు.. ఇంకా ప్రాసెస్‌ జ‌రుగుతోంద‌ని మ‌రో రోజు… కొన్ని సీట్లు మాత్ర‌మే కొలిక్కిరాలేద‌ని ఆ త‌రువాత రోజు ..ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయిని …ఇలా ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తూ కాంగ్రెస్ పెద్ద‌లు సొంత క్యాడ‌ర్‌నే గంద‌ర‌గోళానికి గురిచేస్తుండ‌టంతో టీ కాంగ్రెస్‌లో అయోమ‌యం నెల‌కొంది. అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది. ఏ నియోజ‌క వ‌ర్గాన్ని ఎవ‌రికి కేటాయించారు. ఎవ‌రు పోటీకి దిగుతారు? అందులో ఎవ‌రికి పార్టీ బీఫారాలు ఇస్తుంది? అన్న విష‌యాల్లో ఇంకా ఎవ‌రికి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నాయ‌ట‌. ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే కాంగ్రెస్ నుంచే రెబ‌ల్స్ గ్రూప్ మొద‌ల‌వుతుంద‌ని సీనియ‌ర్‌లు భ‌య‌ప‌డుతున్నారు.

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్టు ఇంకా కాంగ్రెస్ పార్టీ త‌మ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌నే లేదు అప్పుడే ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్య‌ర్థి నేనంటే నేనంటూ లేదు లేదు ముఖ్య‌మంత్రి మా న‌ల్ల‌గొండ జిల్లా నుంచే వ‌స్తాగడ‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వంటి సీనియ‌ర్ నేత‌లు ప్ర‌క‌టిస్తుండ‌టం మ‌రింత గంద‌ర‌గోళానికి దారి తీస్తోంది. ఇక ముఖ్య‌మంత్రి ప‌ద‌వికోసం కాంగ్రెస్ నుంచి ఎంత మంది పోటీప‌డుతున్నారో..అంతే మంది ఆశావ‌హులు ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో టికెట్‌ను ఆశిస్తుండ‌టం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. నామినేష‌న్ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా ఇంకా సీట్ల లెక్క తేల‌క‌పోవ‌డం కూడా మ‌రింత గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌వుతోంది.