షాక్ లో టీ-కాంగ్రెస్ – తెరాస లో సీఎల్పీ సంపూర్ణ విలీనం

Thursday, June 6th, 2019, 11:13:02 PM IST

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ తగిలింది… తెరాస పార్టీ లో సెల్ఫీ విలీన ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియెట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అయితే నేడు తెరాస లో సీఎల్పీని విలీనం చేయాలని 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిశారు. వారి వినతి మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీచేశారు. మొత్తానికి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ ఇక ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. కాగా ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణాలో ప్రతిపక్ష హోదా ఎంఐఎం పార్టీ దక్కించుకుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు… కాగా ఇప్పుడు తెరాస కి మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి, వీరయ్య మాత్రమే మిగిలారు. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ సీటు ఖాళీ అయ్యింది.

తెరాస లో చేరిన నాయకులు వీరే…

1.కాంతారావు (పికపాక)
2.ఆత్రం సక్కు (అసిఫాబాద్)
3.చిరుమర్తి లింగయ్య (నకిరేకల్)
4.బానోతు హరి ప్రియ (ఇల్లందు)
5.సబితా రెడ్డి (మహేశ్వరం)
6.కందాల ఉపేందర్ రెడ్డి (పాడేరు)
7.సుదీర్ రెడ్డి (ఎల్బీ నగర్)
8.వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం)
9.హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్)
10.గండ్ర వెంకట్రమణా రెడ్డి (భూపాలపల్లి)
11.జాజుల నరేందర్ రెడ్డి (ఎల్లా రెడ్డి)
12.పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు)