మూడుద‌శాబ్దాలుగా ఓట‌మి లేని సొంత అడ్డాలో.. జేసీ బ్రదర్స్‌కు చుక్కలు చూపిస్తుంది ఎవ‌రు..?

Wednesday, October 10th, 2018, 05:18:00 PM IST

తెలుగు రాజ‌కీయ నాయ‌కుల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ తీరే వేరు. వారి నోటికి ప‌ని చెప్పారంటే సొంత పార్టీ నేత‌లైనా స‌రే, ప్ర‌తిప‌క్ష నేత‌లైనా స‌రే, జేసీ బ్ర‌ద‌ర్స్ ముందు నోళ్ళు వెళ్ళ‌బెట్టాల్సిందే. అనంతపురంజిల్లా తాడిపత్రికి చెందిన జేసీ బ్ర‌దర్స్ వైఎస్ హ‌యాంలో చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత టీడీపీలో చేరారు. ఇక వీరిలో ఒక‌రైన ప్ర‌భాక‌ర్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి ఎమ్మెల్యేగా గానూ.. మ‌రో సోద‌రుడైన జేసీ దివాక‌ర్ రెడ్డి ఎంపీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాడిప‌త్రిలో 1985 నుంచి వరుసగా జరిగిన ఏడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్య‌ర్ధిగానే జేసీ బ్ర‌ద‌ర్స్ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. అయితే త‌ర‌చూ వివాదాల్లో చిక్కుకుంటున్న జేసీ బ్ర‌ద‌ర్స్ గెలుపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది. ఎందుకంటే రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్ధి నుండి ప్ర‌మాదం పోంచి ఉంద‌ని స‌మాచారం. వైసీపీ తాడిప‌త్రి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కేతిరెడ్డి పెద్దిరెడ్డిని జ‌గ‌న్ నియ‌మించిన విష‌యం తెలిసిందే. దీంతో తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీని ఓడించాల‌నే ల‌క్ష్యంతోనే కేతిరెడ్డి ప్రాణాల‌కు తెగించి విప‌రీతంగా శ్ర‌మిస్తున్నారు.

ప్ర‌స్తుతం తాడిప‌త్రి ప్ర‌జ‌ల్లో జేపీ ఫ్యామిలీ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. ఈ నేప‌ధ్యంలో జేసీ కుటుంబం పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లచుకొని అక్క‌డ వైసీపీ జెండా ఎగుర‌వేయాల‌ని పెద్దిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. తాడిప‌త్రిలో ఎలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా కేతిరెడ్డి వెంట‌నే త‌న బ‌ల‌గందో ఆందోళ‌న‌కు దిగుతూ అధికార పార్టీని ఇబ్బందుల‌కు గురి చేయ‌డ‌మే కాకుండా జేసీ బ్ర‌ద‌ర్స్‌కి మాత్రం చుక్క‌లు చూపిస్తున్నాడు. ముఖ్యంగా మూడు ద‌శాబ్దాలుగా తాడిప‌త్రిని త‌మ అడ్డాగా మార్చుకున్న జేసీ బ్ర‌ద‌ర్స్ పై ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన అసంతృప్తి ఉంది. దీంతో ప్ర‌జ‌ల్లో ఉన్న ఆ అసంతృప్తిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్ఛితంగా గెలుస్తాన‌ని కేతిరెడ్డి పెద్దిరెడ్డి భావిస్తున్నాడు. మ‌రి మూడు ద‌శాబ్దాలుగా ఓట‌మి లేని సుధీర్ఘ‌మైన రాజ‌కీయ మ‌హామ‌హులైన జేసీ బ్ర‌ద‌ర్స్‌కి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అంత ఈజీ కాద‌ని వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డి స‌వాల్ విసురుతున్నాడు. జేసీ బ్ర‌ద‌ర్స్ కిల్లాను పెద్దిరెడ్డి బ‌ద్ద‌లు కొడ‌తాడో లేదో చూడాలి.