మంత్రులు రాజకీయాల్లో కుల చిచ్చులు పెట్టకండి… పవన్ తో జాగ్రత్తగా మెలగండి

Thursday, March 22nd, 2018, 03:48:04 AM IST

రాజకీయంలో కుల చిచ్చులు తలేత్తడమే కాకుండా అది కాస్తా ఇప్పుడు ప్రత్యక్ష దోరణిలో చెలరేగుతున్నది. కాపు కులానికి చెందిన టీడీపీ మంత్రులపై కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు మంత్రులు టీడీపీ స్క్రిప్ట్‌ను చదువుతూ పవన్‌పై ఆరోపణలు చేస్తున్నారని కోపోద్రేకుడయ్యాడు. పవన్‌పై ప్రభుత్వం కాపు మంత్రులచే విమర్శలు చేయించడాన్ని కాపునాడు ఖండిస్తోందన్నారు. సామాజిక మార్పుకోసం పవన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అతనికి రాజకీయాలో అనుభావం లేకపోయినా ఆకలి డోక్కలతో అన్యాయాలకు గురవుతున్నసామాన్య ప్రజలను చూసి ఆవేదన ఆపుకోలేక రాజకీయంలోకి వచ్చి రాజకీయంగా ఎదుగుతున్న పవన్‌పై టీడీపీ కాపు మంత్రులు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాపునాడుకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, కాపుల ప్రయోజనాలే ముఖ్యం అని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పవన్ ఎదిగే క్రమంలో కాపు మంత్రులు అవరోధాలు సృష్టిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇకనున్డైనా నిజం తెలుసుకొని పవన్ కు చేదోడు వాదోడుగా అయినా ఉండండి లేదా నోరు మూసుకొని కూర్చోండి కాని పవన్ కి మాత్రం అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు.