సమస్యలు ఉంటే పోలీసులకు చెప్పండి.. సినిమావాళ్లకు మంత్రి సూచన

Saturday, April 21st, 2018, 11:22:46 PM IST

టాలీవుడ్ లో కొన్ని వారాలుగా కొనసాగుతోన్న వివాదాలపై తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. సినీ ప్రముఖులతో అలాగే మా ప్రతినిధులతో వివాదాల గురించి లైంగిక వేధింపులకు సంబందించిన విషయాల గురించి చర్చలు జరిపారు. సమావేశమనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి ఇలాంటి వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలి అని సినీ పెద్దలకు తెలిపారు. అంతే కాకుండా మీడియా ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు.

జరిగిన పరిణామాలపై చర్చించిన తరువాత ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని సినీ పెద్దలు తెలిపారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఎఫ్‌డీసీ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తాం. మధ్యవర్తులు అలాగే సమన్వయకర్తలు లేకుండా ఉండేలా చూసుకుంటాం. ముఖ్యంగా పారితోషికం విషయంలో నేరుగా ప్రొడక్షన్ టీమ్ నుంచి వారికే అందేలా చేస్తాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు, నటులు ఎవరైనా సరే సమస్యలు వస్తే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలి. న్యాయం పరంగా మరియు చట్టపరంగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుందని వివాదాలకు ఇంతటితో ముగింపు పలకాలని తలసాని మీడియాని కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments