మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన తాజా చిత్రం నెక్స్ట్ ఏంటి డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్లలో భాగంగా మీడియా ముందుకు తమన్నా చేసిన వ్యాఖ్యలే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందని, ముఖ్యంగా ప్రేమ, శృంగారం గురించి ఆలోచించే వాళ్ళకి ఈ చిత్రం ఎక్కువగా నచ్చుతుందని తమన్నా తేల్చి చెప్పింది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్లో బోల్డ్ కంటెంట్ సినిమాల ట్రెండ్ నడుస్తోందని, గ్లామర్ షో చేయడం, బోల్డ్‌గా నటించడం, లిప్‌లాక్‌లు ఇవ్వడం.. ఇవన్నీ స్క్రిప్ట్‌లో భాగమే అని కథ డిమాండ్ చేస్తే అలా నటించడంలో తప్పు లేదని తమన్నా వ్యాఖ్యానించింది. ఇక తనకు కూడా బోల్డ్ సినిమాల్లో నటించడం చాలా ఇష్టమని, అయితే తన వద్దకు అలాంటి కథలు రావడం లేదని, వస్తే నటించడానికి వెనుకాడనని తమన్నా తెల్పింది. ఇక లిప్‌లాక్‌లకు మీరు రెడీనా అని ప్రశ్నించగా.. ఇప్పటి వరకు ఒక్క దర్శకుడు కూడా తనను లిప్‌కిస్ అడగలేదని, కథ డిమాండ్ చేస్తే చేయడానికి నేనే రెడీ అని తేల్చేసింది తమన్నా. దీంతో తమన్నా ఇచ్చిన ఆఫర్‌ని ఏ దర్శకుడు యూజ్ చేసుకుంటాడో చూడాలి.