విశాల్ పై రివేంజ్ తీర్చుకున్న శింబు ఫాదర్ !

Wednesday, December 6th, 2017, 10:10:13 PM IST

ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన హీరో విశాల్ కు నిరాశ ఎదురైంది. ఎన్నికల అధికారులు విశాల్ నామినేషన్ ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. విశాల్ కు కొందరు సినీ ప్రముఖులు మద్దత్తు తెలుపుతుంటే నటుడు, నిర్మాత అయిన టి రాజేందర్ లాంటి వారు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. విశాల్ తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో జనరల్ సెక్రటరీ గా ఉన్నారు. ఆ పదవిని రాజీనామా చేసిన తరువాతే విశాల్ మరె ఇతర ఎన్నికలో అయినా పోటీ చేయాలని రాజేందర్ అన్నారు.

ముందుగా తనకు ఉన్న పదవిలో విశాల్ న్యాయం చేయాలని అన్నారు. విశాల్ కు నామినేషన్ వేయడం చేతకాలేదని అందుకే తిరస్కరణకు గురైందని ఎద్దేవా చేశారు. నిర్మాతల అభివృద్ధికి విశాల్ ఎం చేస్తున్నాడో చెప్పిన తరువాతే ఆర్కేనగర్ లోనే మరె నగర్ లో అయినా పోటీ చేయాలని అన్నారు. కాగా కబాలి ఫేమ్ ధన్సిక ఓ ఈవెంట్ లో రాజేందర్ విషయంలో పొరపాటు చేసింది. దానికి ఆమె క్షమాపణలు కోరినా అనరాని మాటలతో ధన్సికని అవమానించారు. రాజేందర్ తీరుని అప్పట్లో విశాల్ తప్పుబట్టారు. అదియు మనసులో పెట్టుకునే రాజేందర్ తాజాగా విశాల్ పై విమర్శలు చేశారని అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments