బెడ్ రూమ్‌లో బిగ్ బాస్ బ్యూటీ బూతు!!

Monday, February 11th, 2019, 03:21:21 PM IST

సౌత్ లో బూతు సినిమాల ర‌చ్చ పీక్స్ కి చేరుతోంది. ఇటీవ‌లే వ‌చ్చిన `ఏడు చేప‌ల క‌థ‌`, `చీక‌టి గ‌దిలో చిల‌క్కొట్టుడు` ట్రైల‌ర్స్ పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్ల‌డంపై యూత్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. `ఎ` బ్రాండుతో టీనేజీ, కాలేజీ బోయ్స్ ని టీజ్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ సినిమాల్ని మేక‌ర్స్ రూపొందించ‌డంపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బూతు క‌ల్చ‌ర్.. విశృంఖ‌ల‌త పెచ్చు మీరుతోంద‌న్న విమ‌ర్శ‌లతో ప‌లువురు విరుచుకుప‌డుతున్నారు.

అయితే బూతు సినిమాల వెల్లువ ఇంతటితో ఆగేట్టు క‌నిపించ‌డం లేదు. తాజా స‌న్నివేశం చూస్తుంటే బూతు మ‌రింత‌గా పెట్రేగే ప్ర‌మాదం ఉంద‌ని సంకేతాలు అందుతున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళ బిగ్ బాస్ ఫేం ఓవియ ర‌చ్చ ర‌చ్చ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మ‌డు న‌టించిన 90 ఎంఎల్ అనే సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజైంది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం యూత్ చెడిపోయే విశృంఖ‌ల‌త క‌నిపించింద‌న్న‌ది నెటిజ‌నుల వాద‌న‌. ట్రైల‌ర్ ఆద్యంతం వేడెక్కించే బోల్డ్ పెర్ఫామెన్స్ మ‌త్తెక్కించింది. స్మూచింగులు.. బూతు వ్య‌వ‌హారాల‌తో ట్రైల‌ర్ మ‌తి చెడ‌గొట్టింది.

ఎటు చూసినా ట్రైల‌ర్ ఆద్యంతం బూతు క‌నిపించింది. పొగ తాగ‌డం .. మందేసి చిందేయ‌డం.. బాత్రూమ్ సీన్స్.. బెడ్ రూమ్ సీన్స్ తో చెల‌రేపోయింది ఓవియా. ఇక లిప్ లాకుల్లో అయితే హాలీవుడ్ స్టార్స్ ని మించి పోయింది. పార్కింగ్ కార్, బాత్రూమ్, బెడ్ రూమ్ కాదేదీ లిప్ లాక్ ల క‌నర్హం అన్న చందంగా ఓవియా చెల‌రేగిపోయిన వైనం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌స్తుతం ఈ అడ‌ల్ట్ ట్రైల‌ర్ పై నెటిజ‌నుల్లో వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. బిగ్ బాస్ బ్యూటీ ఓవియోపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆడ‌తనానికే సిగ్గు చేటు! అడ‌ల్ట్ జోకులు, బూతు పెట్రేగిపోయిందంటూ నెటిజ‌నులు ఘాటుగానే తిట్టేస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా ట్రైల‌ర్ చివ‌రిలో శిలాంబ‌ర‌సన్ అలియాస్ శింబు అతిధి పాత్ర‌లో ఎంట్రీ ఇచ్చాడు. నివిజ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కింది.