మహేష్ బాబుకు యాక్టింగే రాదు.. కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

Friday, September 14th, 2018, 03:45:57 PM IST

సాధారణంగా సినీ తారలు వివాదాల్లో చిక్కుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎవరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే కొంత మంది విమర్శలు చేసి క్రేజ్ తెచ్చుకోవాలని స్టార్ హీరోలపై పడతారు. ఇది అందరికి తెలిసిన విషయమే. గతంలో ఎంత మంది పవన్ కళ్యాణ్ పేరుతో హల్చల్ చేశారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఇప్పుడు మహేష్ బాబుపై ఒక తమిళ్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే తరహాలో ఉన్నాయి.

మనోజ్‌ ప్రభాకర్‌ అనే ఒక ఆర్టిస్ట్ మహేష్ కు అసలు నటనే రాదని స్పైడర్ సినిమాలో మహేష్ కంటే ఎస్,జే సూర్య అద్భుతంగా నటించినట్లు చెప్పాడు. అంతే కాకుండా మహేష్ ఫెస్ రాక్ ఫెస్ అంటూ.. ఆ సినిమాలో సూర్య డైలాగ్ చెబుతుంటే రాయిలా చూస్తూ ఉండిపోయాడని అన్నాడు. అలాగే స్క్రీన్ పై పెద్ద రాళ్లను చూపిస్తూ మహేష్ ఫెస్ ను ఆ రాళ్లతో పోల్చి కామెంట్ చేయడం ప్రస్తుతం అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కూడా యాక్టింగ్ రాదని చెబుతూ.. మహేష్ బాబును కత్రినాకు మేల్‌ వర్షన్ అంటూ వివాదస్పదంగా పోల్చాడు. మొత్తంగా నెటిజన్స్ మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా అతను వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సోషల్ మీడియాలోనే మహేష్ ఫ్యాన్స్ అతనికి నిద్ర లేకుండా చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments