పవన్ కళ్యాణ్ బాటలో తమిళ హీరో

Monday, January 5th, 2015, 05:55:34 PM IST

vijay
ఇటీవల కాలంలో తమను చూడాలనుకుంటున్న అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను ప్రముఖ సెలబ్రిటీలు కలిసి వారికి సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంగా మన తెలుగునాట జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి తమను చూడాలనుకున్న అభిమానులను కలిసి వారికి ధైర్యాన్ని అందించారు.

ఇక ప్రధమంగా ఖమ్మంలో శ్రీజ అనే చిన్నారిని పవన్ కళ్యాణ్ కలిసి, ఆమె దుస్థితికి కంటతడి పెట్టి, అటుపై ఆమెకు బహుములను ఇచ్చి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం చిరంజీవి కూడా హైదరాబాద్ లోని ఎంఎన్జే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు అనే కుర్రాడిని పలకరించి తన తదుపరి చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇదే తరహాలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన అభిమానులైన చిన్నారులను కలిసి వారికి భారోశా ఇచ్చారు. కాగా ఇప్పుడు ప్రముఖ తమిళ హీరో విజయ్ కూడా అదేబాటలో తనను కలవాలనుకున్న వీల్ చైర్ కు పరిమితమైన అర్చన అనే అమ్మాయిని పరామర్శించి ఆనందపరిచారు. ఇక తనకు ఇష్టమైన హీరో విజయ్ కనపడగానే మురిసిన ఆ బాలిక అతనితో ఫోటోలు తీయుంచుకుని తన కలను నెరవేర్చుకుంది.