విజయ్ పొలిటికల్ ప్లాన్స్ నిజమేనా?

Sunday, September 9th, 2018, 05:40:28 PM IST

తమిళనాడు రాజకీయాల్లో గత కొంత కాలంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జయలలిత మరణాంతరం అక్కడ హీరోలు చాలా మంది రాజకీయాల్లోకి రానున్నట్లు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు కూడా పూర్తిగా రాజకీయాల్లో ఉండడం లేదు. ఓ వైపు సినిమాలు అంటూ మరోవైపు అప్పుడపుడు రాజకీయాలు అంటున్నారు. కమల్ హాసన్ రజినీకాంత్ కి మంచి మద్దతు ఉన్నప్పటికీ అసలైన రాజకీయ అడుగులు వారు ఇంకా వేయలేదు.

అయితే ఇప్పుడు మరో హీరో రెగ్యులర్ పాలిటిక్స్ ని మొదలుపెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు. రజినీకాంత్ తరువాత కోలీవుడ్ లో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్. గత కొంత కాలంగా ఈ హీరో రాజకీయలకు సంబదించిన ప్లానింగ్స్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా గతంలో విజయ్ పాలిటిక్స్ ఎంట్రీ ఉంటుందని వివరణ ఇచ్చాడు. ఇక విజయ్ ఆ మద్యన రైతులకు అండగా ఉండడంతో పాటు స్టెరిలైట్‌‌ రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాడు. అభిమానులతో కూడా పలు సేవ కార్యక్రమాలని జరిపించాడు. దీంతో విజయ్ త్వరలోనే తన రాజకీయ ప్రణాళికల్ని అమలు చేయబోతున్నాడు అని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments