నోటా ట్రైలర్ : ‘ఇది ముఖ్యమంత్రి పదవా లేక..’

Thursday, September 6th, 2018, 05:05:47 PM IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం “నోటా”. నిన్ననే ఈ చిత్రం యొక్క స్నీక్ పీక్ యూ ట్యూబ్ లో విడుదల చేశారు. ఆ కొద్దీ క్షణాల వీడియో కూడా యూ ట్యూబ్ లో దుమ్ము రేపుతూ నెంబర్ వన్ ట్రేండింగ్ లో ఉంది. అయితే ఈ సినిమాను తెలుగు మరియు తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను తమిళ సింగం సూర్య చేతులు మీదగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. రాజకీయ వేత్త గా విజయ్ దేవరకొండ అద్భుత నటనని కనబరిచారు, ఈ చిత్రం లో హీరోయిన్ మెహ్రీన్ న్యూస్ రిపోర్టర్ పాత్ర పోషిస్తున్నట్టు వ్యక్తం అవుతుంది, ఈ చిత్రం లో నాజర్, సత్యరాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు కనపడుతుంది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుని గాను సామ్ సి ఎస్ సంగీత దర్శకునిగా చక్కటి బాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అందించారు. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ ట్రైలర్ ని మీరు కూడ ఒక లుక్కెయ్యండి.

  •  
  •  
  •  
  •  

Comments