తమిళనాడులో ఫ్యాక్టరీ పై యుద్ధం.. కాల్పుల్లో 9 ప్రాణాలు బలి!

Tuesday, May 22nd, 2018, 07:20:25 PM IST

తమిళనాడు తూత్తకూడిలో చూస్తుండగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు మొత్తం చిన్నా భిన్నమయ్యాయి. ప్రభుత్వ ఆస్తులు ప్రయివేట్ ఆస్తులు ఆందోళన కారుల దాడికి దెబ్బ తిన్నాయి. స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని ఎలాగైనా మూసివేయాలని వేల సంఖ్యలో ఆందోళన కారులు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది నిరసనకారులు మృతి చెందారు.

స్టెరిలైజ్ అనే ప‌రిశ్ర‌మ 1996 లో ప్రారంబమయ్యింది. అయితే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పోగల వల్ల జనాలకు శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని భూగర్భ జలాలు కలిషితమవుతున్నాయని అక్కడి స్థానికులు అప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఫ్యాక్టరీని ఇంకా విస్తరించాలని ప్లాన్ చేస్తుండడంతో స్థానికులు ఆందోళనను ఉదృతం చేశారు. మొదట మామూలుగానే బంద్ పాటించినప్పటికీ ఆందోళన కారులు మొదట కర్మాగారం వైపు వెళ్లగా వెంటనే పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆందోళన కారులు కూడా మరింత రెచ్చిపోగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో 9 మంది మరణించారు. ఈ విషయంపై తమిళనాడు మంత్రి జయకుమార్‌ స్పందిస్తూ.. పరిస్థితిని అదుపులోకి తేవడానికి కాల్పులు జరిపారని తెలిపారు. అదే విధంగా సీఎం త్వరలోనే ఈ విషయంపై చర్చలు జరిపి ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూస్తారని కూడా వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments