సినిమా – పాలిటిక్స్ : చంద్ర‌బాబు పై రివ‌ర్స్ అయిన సినీ ప్ర‌ముఖుడు..!

Monday, February 11th, 2019, 02:44:15 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై తాజాగా సినీ ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌రద్వాజ చేసిన వ్యాఖ్య‌లు సినీ రాజ‌కీయ‌వర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సినీ న‌టుడు, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావుకు భార‌తర‌త్న ఇవ్వాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు దాదాపు 15 ఏళ్ళ‌కు పైగానే ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ఇప్న‌టి వ‌ర‌కు ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌లేదు కేంద్ర‌ప‌భుత్వం. అయితే ఈ మ్యాట‌ర్ పై తాజాగా త‌మ్మారెడ్డి స్పందించారు. ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న రాక‌పోవ‌డానికి కార‌ణం చంద్ర‌బాబే అంటూ పెద్ద బాంబే పేల్చారు త‌మ్మారెడ్డి. ఎన్టీఆర్‌కి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డంలో కేంద్ర‌ప్ర‌భుత్వాలు జాప్యం చేస్తున్నాయ‌ని చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ప‌త్రిక‌ల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లు చూశాన‌ని తెలిపారు.

అయితే కేంద్ర‌లో చ‌క్ర‌తిప్పుతున్నాన‌ని చెప్పుకుంటూ, మొన్న‌టి వ‌ర‌కు కేంద్ర‌ప్ర‌భుత్వ‌మైన బీజేపీతో స్నేహం సాగించిన చంద్ర‌బాబు.. ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇప్పించ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని, కానీ ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేద‌ని, అవార్డులు ప్ర‌క‌టించేవ‌ర‌కూ సైలెంట్‌గా ఉండి.. ఆ త‌ర్వాత హంగామా చేస్తూ స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం చూస్తుంటే.. త‌న‌కు అనుమానం క‌లుగుతోంద‌ని త‌మ్మారెడ్డి అన్నారు.

అంత‌టితో ఆగ‌ని త‌మ్మారెడ్డి చంద్ర‌బాబు తీరు చూస్తుంటే.. అదో పెడ్డి స్టోరీలా ఉంద‌ని, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే.. నంద‌మూరి కుటుంబం మొత్తం వెళ్లాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా ఆయ‌న రెండ‌వ భార్య ల‌క్ష్మీపార్వ‌తి అవార్డు తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.. దీంతో ల‌క్ష్మీపార్వ‌తి అవార్డు తీసుకోవ‌డం నంద‌మూరి ఫ్యామిలీకి ఎంత‌మాత్రం ఇష్టం ఉండ‌దు, అలాగే చంద్ర‌బాబుకు అయితే అలాంటివి ఊహించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌డు.. అందుక‌నే ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులే ఆయ‌నుకు భార‌త‌ర‌త్న రాకుండా ఆపుతున్నార‌ని త‌న‌కు అనుమానం ఉంద‌ని త‌మ్మ‌రెడ్డి భ‌రద్వాజ పేర్కొన్నారు.