మా వ్యవహారం పై తమ్మారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ ?

Thursday, September 6th, 2018, 10:43:38 AM IST

ఇటీవలే అమెరికాలో మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబిలీ వేడుకలకు సంబందించిన నిధుల దుర్వినియోగం పై ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయంలో డబ్బులు దుర్వినియోగం చేసారని నటుడు నరేష్ మా అధ్యక్షుడు శివాజీ రాజాపై ఆరోపణలు చేసారు. ఈ వ్యవహారం లో ఇద్దరు మీడియా ముందుకు వచ్చి ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ వ్యవహారం పై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ఇద్దరిని కోప్పడాలో .. తిట్టాలో , నవ్వాలో అర్థం కావడం లేదు. నిజానికి ఇద్దరు మంచి పిల్లలే. వారికీ ఎలాంటి స్వార్దాలు లేవు. కానీ వీరిద్దరూ ఇలా రోడ్డున పడడం చాలా బాధగా ఉంది. పరిశ్రమకు ఇద్దరు కావాల్సిన వాళ్లే. మా సిల్వర్ జూబ్లీ సందర్బంగా అమెరికాలో జరిపే కార్యక్రమం కోసం కమిటీ వేశారు ఆ వేడుకకు ఓ కంపెనీ కోటి రూపాయలు ఇక్కరు. చిరంజీవి గారిని రమ్మంటే అయన వెళ్లారు . అందరు నటీనటులు ఆ వేడుకకు వెళ్లారు. ఇప్పుడు వాళ్ళిచ్చిన కోటి రూపాయలు మిగులుతాయా .. అయినా సంతకాలు పెట్టె ముందు ఆలోచించకుండా ఇప్పుడు అనుకోని ఎం లాభం అని ఘాటుగా స్పందించారు.

  •  
  •  
  •  
  •  

Comments