తార‌క్ గోల్ 200కోట్ల క్ల‌బ్‌

Sunday, May 20th, 2018, 01:21:33 PM IST

విశ్వ‌విఖ్యాత న‌టసార్వ‌భౌమ అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు లెగ‌సీని కాపాడుతోంది ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు ఏకైక స‌మాధానం జూ.ఎన్టీఆర్‌. తార‌క‌రాముని దివ్య‌మైన రూపంతో జ‌న్మించిన తార‌క్ తాత‌గారి లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌డంలో పెద్ద స‌క్సెస‌య్యారు. ఎంద‌రు నంద‌మూరి హీరోలు ఉన్నా.. తార‌క్ ఓన్లీ వ‌న్‌. ఆ సంగ‌తిని ఆ కుటుంబంలో ఇత‌ర హీరోలు ఎవ‌రైనా అంగీక‌రించి తీరాల్సిందే. ఎన్టీఆర్ కెరీర్ కీల‌క స‌మ‌యంలో ఎవ‌రు ఎన్నిర‌కాల కుట్ర‌లు చేసినా అన్నిటినీ ఎదుర్కొన్ని ధీర‌త్వం ప్ర‌ద‌ర్శించి యోధుడ‌య్యాడు. ఓవైపు నంద‌మూరి కాంపౌండ్‌లో క‌ల‌త‌లు ఉన్నా.. త‌న‌ని దూరం పెట్టినా అత‌డు ఏనాడూ ప‌రిస్థితుల‌కు ఝ‌డిసిందే లేదు. అసాధార‌ణ ప్ర‌తిభ‌, విరోచిత పోరాటంతో… ఇప్పుడున్న అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌డిగా వెలిగిపోతున్నాడు. కొడ్తే క‌దిలిపోవాలి. 150కోట్లు జ‌ల‌జ‌లా రాలాలి.. అదీ ఎన్టీఆర్ స్టామినా. ఆ చ‌రిత్ర‌ను లిఖించడానికి నంద‌మూరి ఫ్యామిలీలో ఇప్ప‌ట్లో మ‌రొక‌డు పుట్ట‌బోడు. ఆ సంగ‌తిని నంద‌మూరి హోల్‌ అభిమానులు ఓపెన్‌గా అంగీక‌రిస్తారు. ఎన్టీఆర్ ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా తిరుగులేని బాక్సాఫీస్ శ‌క్తిగా ఎదిగాడు. ఇక‌ముందూ అత‌డి హ‌వాని ఆపే ద‌మ్ము వేరొక‌రికి లేనేలేదు.

ప్ర‌స్తుతం మాట‌ల మాయావి త్రివిక్ర‌మ్‌ ద‌ర్శ‌క‌త్వంలో `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. నిన్న రిలీజైన 6ప్యాక్ లుక్‌, టైటిల్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. 17ఏళ్ల కెరీర్‌.. 28 సినిమాల ట్రాక్ రికార్డ్ తార‌క్ సొంతం. నాణ్య‌మైన సినిమాల్లో న‌టిస్తూ అభిమానుల‌కు వినోదం పంచుతున్నాడు. 29వ సినిమా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో, 30వ సినిమాలో అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఫిక్స‌య్యాయి. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద‌ తార‌క్ స్టామినా 150కోట్లు. త‌దుప‌రి 200కోట్లు.. 300కోట్లు.. అంత‌కుమించి అని నిరూపించాల‌ని ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతూ నేటిఏపీ ఆకాంక్షిస్తోంది

  •  
  •  
  •  
  •  

Comments