మలయాళంలో జూనియర్ ఎన్టీఆర్ రావణాసురన్

Friday, June 8th, 2018, 06:35:02 PM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన జై లవకుశ సినిమా గత ఏడాది ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది అందరికి తెలిసిందే. అయితే ఈ సారి ఆ సినిమాను మలయాళం లో రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. రావాణా అనే పాత్ర మంచి హైలెట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం సినిమాకు హైలెట్ గా నిలిచింది. రావణాసురన్ అనే పేరుతో అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కు మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉంది.

గతంలో కొరటాల శివ దర్శకత్వంలో చేసిన జనతా గ్యారేజ్ అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా పెంచింది. మోహన్ లాల్ ఉండడంతో సినిమాను ఎగబడి చూసిన జనాలు తారక్ కి కూడా అభిమానులు అయిపోయారు. ఇక ప్రస్తుతం జై లవకుశ మలయాళం డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మరి అక్కడ ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments