రౌడీలు, న‌క్స‌ల్స్‌పై ఇప్ప‌టి నుంచే గురి!

Saturday, September 15th, 2018, 12:25:29 AM IST

తెలంగాణ ఎన్నిక‌ల‌కు ముంద‌స్తు ప్రిపరేష‌న్స్ సాగుతున్న వేళ ర‌క‌ర‌కాల విష‌యాల‌పై ప్ర‌భుత్వ ఎన్నిక‌ల అధికారుల్లో చ‌ర్చ సాగుతోంది. ఈసారి ఎన్నిక‌ల‌కు ఏఏ అవ‌స‌రాలున్నాయో ప‌క్క‌గా స్ట‌డీ చేస్తున్నారు. ఇక‌పోతే ఎన్నిక‌లు ఎలాంటి గోల గొడ‌వ లేకుండా ఉండాలంటే స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్ని గుర్తించి, అక్క‌డ రౌడీ యాక్టివిటీస్‌, మావోయిజాన్ని నేల‌మ‌ట్టం చేయాల్సి ఉంటుంది. ఆ దిశ‌గా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక‌పై రౌడీలు గా పేర్లు నమోదై ఉన్నవారి పై ప్రత్యేక నిఘా ఉంటుంది.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలను కాస్త స‌మ‌స్యాత్మ‌క‌మైన‌విగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందింది. దీనిపై కేంద్ర హోమ్ శాఖ‌తో చర్చించి పారా మిలిటరీ బలగాలను వాడుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌పోతే అన‌ధికారికంగా సొమ్ముల ప్ర‌వాహాన్ని ఈసారి ఎన్నిక‌ల్లో ఆపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గత ఎన్నికల్లో 76 కోట్ల రూపాయల ను సీజ్ చేశారు. ఈసారి కూడా వంద శాతం తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థుల ఖర్చు పై నిఘా పెడుతామ‌ని ప‌త్రిక‌ల్లో పెయిడ్ ఆర్టిక‌ట్స్‌పై దృష్టి సారిస్తామ‌ని వెల్ల‌డించారు. అన్ని జిల్లాలో హెల్ప్ డెస్క్ 1950 నంబ‌ర్‌కు పిర్యాదు చేయవచ్చని, పార్టీలు మ్యానిఫెస్టో విడుదల చేశాక‌ పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించ‌నున్నామని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments