5000 ఉద్యోగాలు ఫట్.. టాటా సంచలన నిర్ణయం

Monday, October 9th, 2017, 02:56:14 PM IST

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ తీవ్రతతో చాలా మంది యువకులు సతమతమవుతున్నారు. 100 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుత రోజుల్లో వేలల్లో దరఖాస్తులు అందుతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు నిరుద్యోగ తీవ్రత ఏ విధంగా ఉందొ. అయితే ఇప్పుడు కొన్ని ప్రముఖ కంపెనీలు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న ఉద్యోగులను కూడా మధ్యలోనే తీసివేస్తున్నారు. ఇదే తరహాలో రీసెంట్ గా ఓ బడా కంపెనీ కూడా దాదాపు 5000 మంది ఉద్యోగులను తీసివేయడానికి డిసైడ్ అయ్యింది.

21 సంవత్సరాలుగా నడుస్తోన్న ఫోన్‌ సర్వీసు వెంచర్‌, టాటా టెలిసర్వీసెస్‌కు ఇక ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఎన్నో ఏళ్లు దీని వల్ల కంపెనీకి భారీ నష్టం కలుగుతుందని ఈ విభాగంలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తీసేస్తోంది. ప్రస్తుతానికి నైపుణ్యాలకు తగ్గ వారిని మాత్రమే ఉంచుతున్నట్లు చెబుతూ.. సీనియర్‌ ఉద్యోగులకు మరికొన్ని రోజుల్లో వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ను ఆఫర్‌ చేస్తున్నామని టాటా గ్రూప్‌ సీనియర్‌ అధికారి చెప్పారు. దీంతో మొత్తంగా ఆ కంపెనీ నుంచి దాదాపు 5000 మంది ఉద్యోగులు నిరుద్యోగులు కానున్నారు. టాటా కంపెనీ ఈ స్థాయిలో ఒక నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోలేదు. కానీ నష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకతప్పదని ఎగ్జిక్యూటివ్‌లు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్‌ తెలిపారు.