రివ్యూ : టాక్సీవాలా

Saturday, November 17th, 2018, 01:05:43 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

శివ (విజయ్ దేవరకొండ ) తను చేసే జాబ్ నచ్చక ఒక కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ కావాలని అనుకుంటాడు. ఈక్రమంలో కార్ డీలర్ నుండి కారు ను కొని క్యాబ్ డ్రైవర్ అవుతాడు. అయితే అదే కారులో దెయ్యం వుందని గమనిస్తాడు శివ. ఆ దెయ్యం ఆకారు లో ప్రయాణించే ప్రయాణికులపై రివేంజ్ తీసుకుంటుంది. అసలు ఎవరు ఆ దెయ్యం ? ఎందుకు ఆ కారు లో ఉంటుంది ? ఆమె ఎవరిఫై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? దానికి శివ ఏ విధంగా సహాయపడతాడు అనేదే మిగితా కథ.

విశ్లేషణ :

‘అర్జున్ రెడ్డి , గీత గోవిందం’ చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకొన్న యువ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కూడా మంచి నటనను కనబర్చాడు. శివ అనే పాత్రను ఈజీ గా చేసుకుంటూ వెళ్ళాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ ప్రియాంక వున్నది తక్కువ సేపయినా అటు లుక్స్ పరంగా ఆకట్టుకుంటూ నటన తో మెప్పించింది. ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన మాళవిక నాయర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక విజయ్ స్నేహితుడిగా ‘హాలీవుడ్’ అనే పాత్రలో నటించిన విష్షు సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ , హావభావలతో చాలా వరకు ఎంటర్టైన్ చేశాడు.

ఇక దర్శకుడి విషయానికి వస్తే ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో మంచి స్టోరీ లైన్ ను తీసుకున్న రాహుల్ దాన్ని తెర మీదకు తీసుకరావడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ను డీసెంట్ గా మలిచి సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో పట్టు తప్పాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు.

ప్లస్ :

కాన్సెప్ట్

విజయ్ దేవరకొండ

కామెడీ

మైనస్ :

స్లో నరేషన్

సెకండ్ హాఫ్

సాంగ్స్

తీర్పు :

హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా మెప్పించినా దర్శకుడి రొటీన్ నరేషన్ తో సినిమా పూర్తి స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ నటన , కామెడీ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. చివరగా ఈచిత్రం అన్ని వర్గాల వారు ఒక సారి చూసేలావుందని చెప్పొచ్చు.

Rating : 3/5

REVIEW OVERVIEW
Taxiwaala Movie Review