హిట్టా లేక ఫట్టా : టాక్సీవాలా.. జ‌స్ట్ చిల్ బాస్

Saturday, November 17th, 2018, 03:30:59 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజ‌య్ దేవ‌రకొండ‌కు వ‌చ్చిన ఫేమ్ మ‌రే హీరోకి రాలేద‌ర‌నే చెప్పాలి. అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన విజ‌య్ యూత్ ఐకాన్‌గా మారాడు. ఇక‌ ఆ త‌ర్వాత వ‌చ్చిన గీత‌గోవిందం చిత్రంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ మ‌న‌సుల్లో కూడా చోటు సంపాధించిన విజ‌య్.. ఆ చిత్రంతో వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి సినీ విశ్లేష‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌ర్చాడు.

అయితే ఆ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన నోట చిత్రం బారీ డిజాస్ట‌ర్ అవ‌డంతో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలో వాయిదాల మీద వాయిద‌లు ప‌డుతూ వ‌స్తున్న టాక్సీవాలా చిత్రం విడుద‌ల‌కు ముందు హెడీ క్వాలిటీతో మొత్తం సినిమా ఆన్‌లైన్‌లో రావ‌డంతో విజయ్‌తో పాటు చిత్ర‌యూనిట్ మొత్తం షాక్ తింది. ఈ క్ర‌మంలో ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టాక్సీవాలా చిత్రం హిట్టా-ఫ‌ట్టా అనేది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

టాక్సీవాలా హార్ర‌ర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో.. పేరుకు త‌గ్గ‌ట్టే శివ (విజయ్ దేవ‌ర‌కొండ‌) టాక్సీ డ్రైవ‌ర్‌గా క‌నిపిస్తాడు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే ఆత్మ సంబంధిత ఇంట్ర‌స్టింగ్ పాయింట్ తీసుకున్న కొత్త ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్.. కామెడీని అయితే బాగానే డీల్ చేశాడు.. హ‌ర్ర‌ర్‌కి అవ‌స‌ర‌మైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను స‌రిగ్గా డిజైన్ చేసుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో క‌థ‌లోకి దెయ్యం ఎంట్రీ వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆ త‌ర్వాత చిత్రాన్ని మ‌లిచిన విధానం మాత్రం క‌న్వింస్‌గా అనిపించ‌దు.

ఇక విజయ్, ప్రియాంక మధ్య లవ్ సీన్స్ కూడా స‌రిగ్గా డిజైన్ చేసుకోలేదు ద‌ర్శ‌కుడు. ఇక విలన్‌కు సంబంధించిన సీన్స్‌లో కూడా క్లారిటీ మిస్సైంది. ఇలాంటి కథను డీల్ చేయాలంటే స్క్రీన్ ప్లే పక్కాగా రాసుకోవాలి.. అయితే ఈ చిత్రంలో క‌థ‌నం న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తోంది. విజ‌య్ నుండి ఆశించిన విధంగానే సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్, లైట్ కామెడీ సీన్స్‌తో సరదాగా సాగిన ఫ‌స్ట్‌హాఫ్.. మంచి ట్విస్ట్‌తో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ప‌డి ప్రేక్ష‌కుల్లో ఆశ‌క్తిని పెంచుతుంది. ఇక సెకండ్‌హాఫ్ మాత్రం స్లో నెరేష‌న్.. ముఖ్యంగా మార్చురీ సీన్‌ సూపర్బ్ అనిపించినా.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ స‌న్నివేశాలు మాత్రం ప్రేక్ష‌కుల‌కు చిరాకు తెప్పిస్తాయి.

విజయ్ దేవరకొండ మాత్రం ఈ చిత్రాన్నితన భుజాల‌ మీదనే నడిపించాడు. ఎప్పటిలాగే తనదైన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో విజ‌య్ అద‌ర‌గొట్టాడు. మ‌ధునంద‌న్‌, హాలీవుడ్ క్యారెక్ట‌ర్ చేసిన విష్ణు త‌మ‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల్లో న‌వ్వులు పూయిస్తారు. ఇక తమిళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ నిరాశ‌ప‌ర్చ‌గా.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మెప్పించాడు. సుజిత్ సారంగ్ ఫొటో గ్ర‌ఫీ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. ఎడిటింగ్ మ‌త్రం సెకండాఫ్‌లో కొంచెం క‌త్తిర వేస్తే బాగుండేది. నిర్మాత‌గా తొలి సినిమా అయినా ఎస్‌కేఎన్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఖ‌ర్చుపెట్టాడు. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే విజ‌య్ దేవ‌ర‌కొండ నుండి ఆశించిన మెరుపులు ఫ‌స్ట్‌హాఫ్‌లో ఉన్నా సెంక‌డ్‌హాప్ బాగా స్లో అవ‌డంతో ఏ సెంట‌ర్ ఆడియ‌న్స్ క‌న్విన్స్ అయినా.. బీసీ సెంట‌ర్స్ ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే దాన్ని బ‌ట్టే టాక్సీవాలా హిట్టా ఫ‌ట్టా అనేది తేలుతుంది. లేక‌పోతే జ‌స్ట్ చిల్ బాస్ అనాల్సిందే.

సరదాగా సాగిపోయే రైడ్

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

ట్యాక్సీవాలా.. ఒక రైడ్ వేస్కోవచ్చు

Reviewed By tupaki.com |Rating : 2.75/5

ఆసక్తికరమైన థ్రిల్లర్

Reviewed By Thehansindia.com |Rating : 2.75/5

వినోధంతో కూడిన థ్రిల్లింగ్ రైడ్

Reviewed By Gulte.com |Rating : 3/5