టాక్సీవాలా మూవీ.. ప‌బ్లిక్ టాక్.. ఫ‌స్ట్ షోకే తేల్చేశారు..!

Saturday, November 17th, 2018, 08:18:37 AM IST

టాలీవుడ్‌లో అనూహ్యంగా దూసుకు వ‌చ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో ట్రెండ్ సెట్ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన గీత‌గోవిందం చిత్రంతో వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరిన విజ‌య్ ఇండ‌ష్ట్రీలో మోస్ట్ వాంటెండ్ హీరో అయ్యాడు. ఇక అదే ఊపులో పొలిటిక‌ల్ నేప‌ధ్యంలో వ‌చ్చిన నోట చిత్రం విజ‌య్‌కి ఊహించని షాక్ ఇచ్చింది.

దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావించిన విజ‌య్ టాక్సీవాలాతో ప్రేక్ష‌కులుముందుకు వ‌చ్చాడు.నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంక జువల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. మ‌రి ఇప్పుడు ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప‌బ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.

హ‌ర్ర‌ర్, కామెడీ నేప‌ధ్యంలో తెర‌కెక్కిన టాక్సీవాలా చిత్రం.. విజ‌య్ మీద న‌మ్మ‌కంతో ఎక్కువ ఎక్స్‌ప‌ర్టేష‌న్స్ పెట్టుకొని వెళితే నిరాశే ఎదుర‌వుతోంద‌ని.. ఇటీవ‌ల్ వ‌చ్చిన హ‌ర్ర‌ర్, కామెడీ చిత్రాల‌తో పోలిస్తే.. ఈ చిత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోద‌ని, అక్క‌డ డ‌క్క‌డా కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నా, గ్రిప్పింగ్ స్క్రిప్ట్ లేక‌పోవ‌డంతో ఈ చిత్రం యావ‌రేజ్‌గా నిలుస్తోంద‌ని, ఇక ఈ చిత్రంలో విజ‌య్ న‌ట‌న ప‌ర్వాలేద‌ని, కాక‌పోతే విజయ్ నుండి యూత్ ఆశించే ఎలిమెంట్స్ లేవ‌ని, కామెడీ సీన్లు కూడా పెద్ద‌గా పండ‌లేదని, దీంతో టాక్సీ వాలా చిత్రం బిలో యావ‌రేజ్‌గా నిలుస్తోంద‌ని సినిమా చూసిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాల‌ను తెల్పుతున్నారు.