టాక్సీవాలా మూవీ ట్విట్ట‌ర్ టాక్.. విజ‌య్ మ‌ళ్ళీ కొట్టాడా..?

Saturday, November 17th, 2018, 11:50:05 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. ప్రియాంక జువల్కర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ -2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడో రావాల్సి ఉండ‌గా..కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ శ‌నివార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టాక్సీవాలా ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ అయ్యాయి.

దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతున్నారు. మ‌రి ఈ చిత్రం ట్విట్టర్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. టాక్సీవాలా వావ్ అనేలా లేక‌పోయినా.. థ్రిల్లింగ్‌గా ఉంద‌ని.. మ‌రోసారి విజ‌య్ న‌ట‌న ప్రేక్ష‌కుల్లో న‌వ్వులు పూయించింద‌ని, బిగినింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేస్తుంద‌ని కొంద‌రు ట్వీట్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే ఈ చిత్రం పై పెద‌వి విరుస్తున్నారు. ఈ చిత్రం చాలా బోరింగ్‌గా ఉంద‌ని, విజ‌య్ న‌ట‌న రొటీన్‌గా ఉంద‌ని, ఒక్కసారి చూడ‌డం కూడా అన‌వ‌స‌రం అని, బిలో యావ‌రేజ్ అని తేల్చేస్తున్నారు. మ‌రి టాక్సీవాలా ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి