మళ్లీ టీఆర్పీ రేటింగ్స్ కొల్లగొట్టేందుకు సిద్ధమైన విజయ్ దేవరకొండ..!

Monday, February 11th, 2019, 10:00:40 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా, డెబ్యూ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన టాక్సీవాలా ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలకు ముందే పైరసీకి గురై నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని, చాలా సార్లు విడుదల వాయిదా పడి కచ్చితంగా డిజాస్టర్ అవుతుంది అనుకునే స్థాయికి చేరింది. కానీ, విడుదలయ్యాక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మంచి టాక్ తో బాక్సాఫీస్ పెద్ద సినిమాలకు ధీటుగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ కథంతా ఎందుకు అంటే, టాక్సీవాలా ఈ నెల జీ తెలుగులో ప్రసారం కానుంది, అంటే వెండితెరపై సంచలన విజయం నమోదు చేసిన ఈ సినిమా బుల్లి తెరపై కూడా రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ సాధించటానికి రెడీ అయ్యిందన్నమాట.

గతంలో విజయ్ దేవరకొండ సినిమాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు టీవిలో ప్రసారమై హయ్యెస్ట్ రేటింగ్స్సాధించాయి. గీతగోవిందం సినిమా 20.80 టీఆర్పీ రేటింగ్స్ తో ఇప్పటికి ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది. మరీ, టాక్సీవాలా సినిమాతో గీతా గోవిందం పేరిట ఉన్న రికార్డును క్రాస్ చేస్తాడో లేదో తేలాలంటే వచ్చే ఆదివారం దాకా వేచి చూడాలి.