కెసిఆర్,మోడీలు చేసిన మోసాలే మాకు కావాలి.!

Monday, October 8th, 2018, 01:25:59 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నసందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతు రావు గారు తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.అటు కేంద్రలో మోడీ ఇటు రాష్ట్రంలో కెసిఆర్ ప్రజలను మోసం చేసినటువంటి మాటలే ఇప్పుడు వారి గెలుపుకి నాంధి పలకబోతున్నాయి అన్నట్టుగా వ్యాఖ్యానించారు.

తెలంగాణలో 2014 ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇక్కడి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని,అప్పుడు ఆయన మానిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ,హరిజన ముఖ్యమంత్రి చేస్తానన్న విషయంలో కానీ ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న మాటల్లో కానీ ప్రతీ హామీలో అబద్దాలు ఉన్నాయని,అందుకని తెలంగాణా రాష్ట్ర ప్రజలు తీవ్ర స్థాయిలో వారికి వ్యతిరేకతని కనబరుస్తున్నారని, తెలిపారు.

అదే సందర్భంలో మోడీ కోసం కూడా కేంద్రంలో ఎన్నో అబద్ధాలు చెప్పారని,భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీసి ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు, భారత దేశంలో కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారని ఇప్పుడు కెసిఆర్,మోడీలు కలిసిపోయారని వ్యాఖ్యానించారు.వీరు ఇద్దరు ప్రజలకి చేసినటువంటి మోసాలే ఇప్పుడు మాకు ప్రయోజకరంగా మారుతున్నాయని ఇటు తెలంగాణలోనూ మరియు కేంద్రంలోను ఎట్టి పరిస్థిలోను గెలిచేది కాంగ్రెస్సే అని తెలిపారు.