రోడ్ షో లో కుప్పకూలిన టీకాంగ్రెస్ స్టేజి..కింద పడిపోయిన విజయశాంతి.!

Friday, October 12th, 2018, 07:10:54 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున అన్ని పార్టీల వారు వారి ఎన్నికల ప్రచారం నిమిత్తం రోడ్ షో లు నిర్వహిస్తారు.అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణలో టీకాంగ్రెస్ నేతలు ఒక రోడ్ షో నిర్వహించారుఈ రోడ్ షో కి గాను వారి స్టార్ కాంపైనర్ అయినటువంటి విజయశాంతి గారు కూడా హాజరయ్యారు.దాని అంతరం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు దానితో వారి నేతలు ప్రజల వద్ద ప్రసంగించడానికి ఒక స్టేజిని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

టీకాంగ్రెస్ నేతలు అంతా ఆ స్టేజి మీద కూర్చున్నారు అదే సందర్భంలో అక్కడికి వచ్చిన విజయశాంతి కూడా అక్కడి కార్యకర్తలకు మరియు అభిమానులకు తన అభివాదం తెలుపుతూ స్టేజి పైకి అటు వైపుగా వెళ్లి వస్తుండగా అకస్మాత్తుగా ఆ స్టేజి కూలిపోయింది.దీనితో వెంటనే అక్కడే ఉన్న విజయశాంతి అక్కడే పడిపోయారు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమయ్యి విజయశాంతిని లేపారు.అందరు స్టేజి పైనే ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు.