కెసిఆర్, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని సీఎం అయ్యాడు..!

Monday, October 8th, 2018, 11:44:14 AM IST

తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యంమత్రి కెసిఆర్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇతర పార్టీలు ఐనటువంటి కాంగ్రెస్,టీడీపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు.అదే స్థాయిలో వారి వ్యతిరేఖ పార్టీలు కూడా కెసిఆర్ ను విమర్శించుకుంటూ వచ్చారు.ఇటీవలే టీకాంగ్రెస్ నేత మరియు వారి స్టార్ కాంపైనర్ అయినటువంటి రాములమ్మ విజయశాంతి కెసిఆర్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆవిడ కెసిఆర్ మీద ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అందరికి తెలుసనీ,అసలు కెసిఆర్ నోటి నుంచి ఏ రోజు నిజాలు రాలేదని,అది ఆయన మొదటి స్థాయి లోనే ఒక దళిత సోదరుని ముఖ్యమంత్రిని చేస్తానన్న మాటతోనే ఆయన అబద్దం మొదలయిందని తెలిపారు.తెలంగాణా రాష్ట్రం ఇవ్వక మునుపు కెసిఆర్ తన కుటుంబంతో కలిసి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి దళితుని కాకుండా తనని ముఖ్యమంత్రిని చేస్తే తన తెరాస పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రాధేయ పడ్డారని దానితో సోనియాగాంధీ ససేమిరా అనడంతో యూటర్న్ తీసుకొని నేను విలీనం చెయ్యట్లేదు అని ఒంటరిగానే వెళ్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యారని ఇది వాస్తవంగా జరిగిన కథ అని తెలిపారు.