సోషల్ మీడియా తో కెసిఆర్ ను టార్గెట్ చేస్తున్నాం.!

Saturday, October 13th, 2018, 06:58:42 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది.తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ డిసెంబరు ఎన్నికల బరిలోకి దిగుతున్నా సరే ప్రధాన పోరు మాత్రం తెరాస మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యలోనే ఉంటుంది అని వేరే చెప్పక్కర్లేదు.ఐతే కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ని మళ్ళీ గెలవనివ్వకూడదని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.అదే క్రమంలో కెసిఆర్ యొక్క వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నామని ఎప్పుడో తెలిపారు.ఈ రోజుల్లో ఏ విషయమైనా ప్రజల్లోకి ప్రసార మాధ్యమాల కన్నా సోషల్ మీడియానే ఇప్పుడున్న యువతని జనాన్ని ఎక్కువగా శాసిస్తుందని,చెప్పొచ్చు.

ఇప్పుడు ఈ సోషల్ మీడియానే కాంగ్రెస్ పార్టీ వారు కెసిఆర్ మీదకు వారి ఆయుధంగా ఎక్కుపెట్టనున్నాం అని టీకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.ఢిల్లీలో రాహుల్ గాంధీ తో సమావేశం అయ్యాక జరిగిన ప్రెస్ మీట్ లో తెలంగాణా రాష్ట్రంలో వారు చేసిన అన్యాయాల్ని ప్రజలందరికి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తామని,4 కోట్ల మందికి వచినటువంటి తెలంగాణా కేవలం నలుగురి గుప్పెట్లో ఎలా ఉండిపోయింది,ఇక్కడి రైతుల యొక్క ఆవేదన,నిరుద్యోగుల ఆవేదన కెసిఆర్ యొక్క అన్ని వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్ళబోతున్నామని,ఈ సారి మాత్రం వారి ఎన్నికల ప్రచారం కొత్త తరహాలో ఉండబోతుంది అని వారి యొక్క ఎన్నికల మ్యానిఫెస్టోని కూడా అదే విధంగా తీసుకెళ్ళబోతున్నామని తెలిపారు.