100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిన టిసిఎస్

Monday, April 23rd, 2018, 03:37:43 PM IST

పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ కంపెనీ షేర్ ల విలువను పెంచుకోవడం ద్వారా తమ మార్కెట్ ను మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతుంటాయి. భారత దేశంలో అతి పెద్ద దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్ మార్కెట్ లో తన కంపెనీ మార్కెట్ విలువను 100 బిలియన్ డాలర్లకు పెంచుకుని ఒక అద్భుత రికార్డు సాధించింది. అనగా మన భారత దేశ కరెన్సీ ప్రకారం రూ. 6, 60, 000 కోట్లు. అయితే ఇందుకోసం కంపెనీ లోని ఉద్యోగులు ఎంతో శ్రమ పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఆ సంస్థ ప్రారంభించబడింది 50 ఏళ్ళ క్రితం. అయితే ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని వీరి షేర్ విలువ అమాంతం పెరిగిపోయింది.

కాగా ఈ ఒక్కరోజే కంపెనీ రూ 40 వేళా కోట్ల మేర తన విలువను పెంచుకుంది. కాగా ఇటువంటి ఘనత సాధించిన తొలి కంపెనీగా టిసిఎస్ అవతరించింది. నిజానికి ఈ మెయిలు రాయిని అందుకోవడంలో మరి ఏ ఇతర దేశీయ కంపెనీ కైనా అంత సాధ్యం కాదని చెప్పాలి. అయితే టిసిఎస్ కి ముక్యమైన పోటీగా వున్నా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 38 బిలియన్ డాలర్లు గా వుంది. అయిది ఈ ఘనతను దక్కించుకోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అయితే టిసిఎస్ షేర్ 3.53 శాతం పెరిగి 3,526గా ముందుకెళుతోంది…..

  •  
  •  
  •  
  •  

Comments