చంద్రబాబుపై కామెంట్స్ చేసి నవ్వుల పాలైన బీజీపీ నేత !

Tuesday, September 25th, 2018, 10:14:59 AM IST

చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే నేతల్లో నేతల్లో బీజేపీ స్పోక్స్ పర్సన్ జివీఎల్ నరసింహారావు ఒకరు. ప్రతిసారీ బాబుపై పక్కా ఆధారాలు చూపిస్తూ విరుచుకుపడే ఈయన ఈసారి మాత్రం పప్పులో కాలేశారు. వెనక ముందు చూసుకోకుండా ముఖ్యమంత్రిపై కామెంట్స్ చేసి జనల చేతిలో నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు ఐక్యరాజ్య సమితి కార్యక్రమానికి హాజరయ్యేందుకు విదేశాలకు వెళ్లారు.

దీన్ని గమనించిన జివీఎల్ యునైటెడ్ నేషన్స్ వెబ్ సైట్ తెరిచి సభల్లో మాట్లాడబోయేవారి వివరాలను చకచకా పరిశీలించి అసలు ప్రశ్నగించే వాళ్ళ జాబితాలో బాబు పేరు లేనేలేదని, అయినా ఐక్యరాజ్య సమితి సమావేశం అంటూ బాబు అబద్దం చెప్పి విదేశాలకు వెళ్లారని, వాస్తవానికి ఆయన రాష్ట్ర అప్పుల నిమిత్తం ఎకనామిక్స్ ఫారంను కలవడానికి న్యూయార్క్ వెళ్లారని ట్వీట్లు వేసి నానా రచ్చ చేశారు. దీంతో ఈ అంశం అందరిలోనూ ఆసక్తిని రేపింది.

ఇక్కడే జివీఎల్ తొందరపాటు బయటపడింది. ఆయన వేసిన ట్వీట్లకు సమాధానమిస్తూ కొందరు నెటిజెన్లు యునైటెడ్ నేషన్స్ వెబ్ సైట్లో ఉన్న 8 నిముషాల పాటు చంద్రబాబు నాయుడు మాట్లాడనున్న ప్రసంగం వివరాల్ని జతచేశారు. ఇంకేముంది టీడీపీ కార్యకర్తలు, బాబు అభిమానులు నరసింహారావును మీకు విమర్శించడం కూడ రాదా, అసలు చదువుకున్నారా మీరు అంటూ ఒక ఆట ఆడేసుకున్నారు. ఇక ఈరోజు చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశంలో సుస్థిర-అభివృద్ది ప్రభావం సదస్సులో మాట్లాడాక జివీఎల్ విమర్శ మరింత హాస్యాస్పదంగా మారిపోయింది.