విశాఖ భూకుంభకోణంలో తెర ముందు బీజేపీ, తెర వెనుక వైసీపీ

Wednesday, January 25th, 2017, 09:25:29 PM IST

bjp-tdp
విశాఖ – ముద‌పాక (పెందుర్తి ) భూకుంభ‌కోణం ప్ర‌స్తుతం సంచ‌ల‌నం రేపుతోంది. రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇదో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇది తేదేపా వ‌ర్సెస్ బీజేపీ యుద్ధంగా .. తెర‌వెనక బీజేపీ వెంట ఉండి వైసీపీ ఆడిస్తున్న దొంగాట‌కంగా వ‌ర్ణిస్తున్నారు కొంద‌రు.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమాయ‌క రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూములు కొట్టేసి, 1000 కోట్లు కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారు. ల్యాండ్స్ కొని స‌ర్టిఫిక‌కెట్లు తీసుకుని, ప్రామిస‌రీ నోట్లు రాయించుకుని చాలానే చేశారు. ప్ర‌భుత్వ‌మే ఈ భూములు స్వాధీనం చేసుకుంటుందంటూ బెదిరించి రైతుల భూముల్ని లాక్కున్నారంటూ.. నిన్న‌టిరోజున‌ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిన్న‌టిరోజున ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తేదేపా కౌంట‌ర్ ఎటాక్ స్టార్ట్ చేసింది.

“ఇది భూకుంభ కోణం కాదు.. ప్ర‌భుత్వం జీవో ఇచ్చిన భూముల్ని ఎవ‌రూ కొన‌రు. ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొడుతూ మ‌ధ్య‌వ‌ర్తులు ఆడుతున్న దొంగ నాట‌క‌మిద‌“ని తేదేపా శాస‌న స‌భ్యుడు పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ ఖండిస్తున్నారు. వైసీపీ నేత‌ల అండ‌దండ‌ల‌తో బీజేపీ నేత ఇలా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యుడిని అయిన న‌న్ను అడ‌క్కుండా ఇలా చేస్తారా? ఆ భూముల గుండా వేసిన‌ రోడ్డు అట‌వి మార్గం గుండా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు వేయించుకున్న‌ది. మిత్ర‌ప‌క్షంగా ఉంటూ వైసీపీకి కొమ్ములు కాస్తున్నారంటూ విష్ణుకుఆర్ రాజుపై ఫైర‌య్యారు. అలాగే ఈ భూవివాదంలో ముద‌పాక‌కు చెందిన రైతులు రెండుగా చీలిపోయి ఇటు తేదేపాకి కొంద‌రు, అటు బాజ‌పాకి కొంద‌రు మ‌ద్ద‌తు తెలప‌డం విశేషం.