టీడీపీ- కాంగ్రెస్ పొత్తు ప‌త్రికాధినేత గ‌రం గ‌రం!?

Tuesday, September 11th, 2018, 12:56:44 AM IST

బ్ర‌హ్మం గారి కాల‌జ్ఞానం నిజ‌మ‌వుతోంది. క‌ళియుగంలో ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంద‌న‌డానికి ప్ర‌స్తుత రాజ‌కీయాలు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఎలుక – పిల్లి స్నేహం చేయొచ్చా? పాము – ముంగిస‌ చెలిమి చేయొచ్చా? కానీ చేస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఇది సాధ్య‌మ‌వుతోంది. ఇక్క‌డ ఏదైనా సాధ్య‌మే. కాక‌పోతే కాంగ్రెస్‌తో తేదేపా చెలిమి ఏంటి? తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ కొత్త స‌న్నివేశం ఊహాతీత‌మైన‌ది. రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం, అధికార పార్టీని బ‌ద‌నాం చేయ‌డం కోసం ఎంత‌కైనా తెగించే ఎత్తుగ‌డే ఇది. శ‌త్రువును ఎదుర్కోవాలంటే ఏ పొత్తుకైనా రెడీగా ఉండాల‌ని ఆ రెండు పార్టీలు నిర్ణ‌యించుకోవ‌డ‌మే చారిత్రాత్మ‌కం. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ – తేదేపా పొత్తు దేశ‌చ‌రిత్ర‌లోనే అన్ వాంటెడ్ హిస్ట‌రీగా మార‌బోతోంది. తెలంగాణ వ‌ర‌కూ చంద్ర‌బాబు ల‌క్ష్యం ఒక్క‌టే. త‌మ పార్టీని నామ‌రూపాల్లేకుండా తొక్కేసిన కేసీఆర్‌ని, ఆయ‌న పార్టీని తుంగ‌లో తొక్కేసే ఏ అవ‌కాశాన్ని అయినా స‌ద్వినియోగం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యం. అందుకు త‌గ్గ‌ట్టే అత‌డి క‌ద‌లిక‌లు ఉన్నాయి.

ఇక‌పోతే ఈ పొత్తు ఓ అగ్ర‌ ప‌త్రికాధిప‌తికి అస్సలు న‌చ్చలేదుట‌. త‌న ప్రాప‌కానికి అది ఏమాత్రం శుభ‌సూచిక కాద‌ని భావిస్తున్నారట‌. ఆ మేర‌కు త‌న ప‌త్రిక‌లో `కొత్త ప‌లుకు` పేరుతో కాల‌మ్‌ రాయ‌డం ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. వాస్త‌వానికి ఆయ‌న కోరిక మేర‌కు తెలంగాణ‌లో కేసీఆర్ బావుండాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు బావుండాలి. త‌న ప‌త్రిక ప్రాప‌కం వెన‌క‌, ఎదుగుద‌ల వెన‌క చంద్ర‌బాబు ఉన్నారు. అందువ‌ల్ల బాబు అనాదిగా జిగిరీ దోస్తీ. అయితే తెలంగాణ‌లో అక‌స్మాత్తుగా మారిన స‌న్నివేశం త‌న‌కు డైజెస్ట్ కావ‌డం లేదుట‌. ఇక్క‌డ కేసీఆర్ ని ఓడించ‌డం కోసం చంద్ర‌బాబు కాంగ్రెస్‌ని క‌లుపుకుపోవ‌డం అత‌డికి ఏమాత్రం న‌చ్చ‌లేదు. అది `ఆత్మ‌హ‌త్యా స‌దృశం` అంటూ పెద్ద కొటేష‌న్ ఇచ్చారు. అయితే ఆయ‌నిలానే ఎందుకు కోరుకుంటున్నారు? అంటే త‌న‌ స్వీయ ప్ర‌ప‌కానికి ఆ పొత్తులు అడ్డంకి. ఇదివ‌ర‌కూ తేదేపాకు అనుకూలంగా, తేరాస పార్టీకి వ్య‌తిరేకంగా వెళ్లిన ఏబీఎన్ చానెల్‌ని నామ‌రూపాల్లేకుండా తొక్కేశారు కేసీఆర్‌. దాంతో ఆ త‌ర్వాత స‌ద‌రు ప‌త్రికాధిప‌తి రాధాకృష్ణ వేమూరి రాజీకి రావాల్సొచ్చింది. కేసీఆర్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకోవాల్సొచ్చింది. దీని విలువ ఎంతో కాస్ట్‌లీ. కేసీఆర్ అనుకూల భ‌జ‌న ప‌త్రిక‌లో చేస్తే, క్విడ్‌ప్రోకో త‌ర‌హాలో ప్ర‌తిగా వేరే తాయిలం త‌న‌కు ముట్టింది. ప‌త్రిక‌కు పుష్క‌లంగా తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న‌లు వెల్లువెత్తాయి. అప్ప‌ట్లో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక పాత కార్యాల‌యం త‌గ‌ల‌బ‌డింది. దాంతో హుటాహుటీన ఆ ఆఫీస్‌ని సంద‌ర్శించిన కేసీఆర్ వెంట‌నే న‌ష్ట‌నివార‌ణ‌గా ఓ కొత్త ప్లేసును ఆంధ్ర‌జ్యోతికి కేటాయించారు. అందుకే కొత్త ప‌లుకు క‌థ‌నంలో ప్ర‌త్యేకించి కేసీఆర్ -తేరాస‌ను ఆకాశానికెత్తేస్తూ ఎన్నిక‌లొస్తే టీఆర్ఎస్ ఏకంగా 80 సీట్లు గెలుచుకుంటుంద‌ని, స్ప‌ష్ట‌మైన మెజారిటీతో నెగ్గుతుంద‌ని రాసేశారు. ఇక‌పోతే తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో తేదేపా చెలిమి చేస్తే ఆ మేర‌కు ఏపీలోనూ టీడీపీకి పంచ్ ప‌డుతుంద‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం. మొత్తానికి క‌థ‌నం హైలైట్‌గా ఉంది. స్వార్థం, ఆశ్రిత ప‌క్ష‌పాతం వ‌గైరా ఇన్‌బిల్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క‌థ‌నాలు రాయ‌డంలో స‌ద‌రు ప‌త్రిక‌కు ఉన్న రికార్డు మామూలుది కాదని చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ తెలంగాణ‌లో కేసీఆర్ ఓడిపోతే, ఏపీలో చంద్ర‌బాబు ఓడిపోతే ఆ ప‌త్రిక ప‌రిస్థితేంటో? అంటూ ఒక‌టే ముచ్చ‌టా సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments