పవన్ కళ్యాణ్ వేవ్ ని ఆపే ప్రయత్నం సాధ్యమా? ప్రత్యేక దృష్టి!

Monday, September 25th, 2017, 03:41:01 PM IST


ఏపీ రాష్ట్ర రాజకీయాలలో జరిగే మార్పుల మీద ప్రజలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు. ఎప్పుడు ఎం జరిగిన వాటి వెనక, ముందు ఎం జరిగి ఉంటుంది అనే విషయాన్ని పల్లెటూళ్ళో రచ్చబండల మీద కూర్చొని మరి మాట్లాడుకుంటారు. ఎ పార్టీ తమ నాయకులతో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టిన ఆ మీటింగ్ ఎందుకు పెట్టారు, అసలు అక్కడ ఎం మాట్లాడుతారు అనే విషయాలని ఎవరి కోణంలో వారు పరిశీలించి, పరిశోధించి వారికి అనిపించింది చెబుతారు. ఇప్పుడు ఇలాంటి రాజకీయ చర్చలు ప్రతి చోట జరుగుతున్నాయి. దానికి కారణం రానున్న ఎన్నికలు. మరో రెండేళ్ళలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. వాటి కంటే ముందుగా రాష్ట్రంలో ప్రధాన నగరాలకి మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కీలకంగా ఉన్నవి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఇలా ప్రతి చోట మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు రెండు వారి ప్రయత్నంలో వారు ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్సార్ కుటుంబం అంటూ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇంటింటికి టీడీపీ అంటూ తన ప్రయత్నంలో తాను ఉన్నారు. ప్రజలని ఆకర్షించే పనిలో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే ఇలాంటి టైంలో మరో వైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మెల్లగా ప్రజల మధ్యకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీ- బీజీపేకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి సొంతగా తన బలం నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్, జనంలో అతని మీద పెరుగుతున్న పోసిటివ్ వైబ్రేషన్ కి రెండు పార్టీలకి భాగా టెన్షన్ పట్టుకుంది. అతన్ని నియత్రించడానికి రెండు పార్టీలు వారికున్న అవకాశాన్ని వెతుకుతున్నాయి. అయితే జనసేన పార్టీని కార్నర్ చేసే ఎ అవకాశం వారికి దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితిలో ఇటు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మరో సారి ఆశాదీపంగా కనిపిస్తున్నాడు. అతన్ని ఎలా అయన ఫ్రేమ్ లోకి తీసుకురావడం ద్వారా టీడీపీ బలం పెంచుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ని కాస్తా నియంత్రించే ప్రయత్నం చేయొచ్చని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరో వైపు వైసీపీ కూడా ఏదైనా పెద్ద సపోర్ట్ తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. దానికి సూపర్ స్టార్ ఇమేజ్ ని ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే ఏమైనా లాభపడే అవకాశం ఉందా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎ ఒక్క అవకాశం ఉన్న జనసేనని నిలువరించే ప్రయత్నంలో మాత్రం రెండు పార్టీలు ఉన్నాయి. అయితే మరో వైపు తారక్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కి అంతర్గతంగా సపోర్ట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో, తారక్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపధ్యంలో తారక్ కూడా రాజకీయాలకి కొంత కాలం దూరంగా ఉండి సినిమా కెరియర్ మీద పూర్తి ద్రుష్టి పెట్టినట్లు ఈ మధ్య అతను చెప్పిన మాటల బట్టి అర్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో టీడీపీకి ఉన్న అవకాశం ఏంటి అనేది చంద్రబాబుకె తెలియాలి.

Comments