టీడీపీ – వైసీపీ ఒకే దారిలో వెల్తున్నాయే! అప్పుడే ఎన్నికల గురించ!

Thursday, September 28th, 2017, 08:44:15 AM IST


ఏపీలో అధికార టీడీపీ పార్టీ, ప్రతి పక్ష వైసీపీ పార్టీ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే ఎన్నికలు సమీపించడానికి మరో రెండేళ్ళ సమయం ఉంది. కాని అప్పుడే ఈ రెండు పార్టీలు తమ బాద్యతలని వదిలేసి ఎన్నికల్లో ప్రజలని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అనే పనిలో ఉన్నట్లు ప్రస్తుతం వినిపిస్తుంది. ఓ వైపు రాష్ట్రం కష్టాల్లో ఉంది, అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పటికే మూడేళ్ళు గడిచిపోయిన రాజధానిలో ఒక అసెంబ్లీ భవనం తప్ప ఇంకే నిర్మాణం స్పీడ్ అవ్వలేదు. పెట్టుబడులు వరదా పారుతున్నాయి. విదేశీ కంపెనీలు మన అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకి వస్తున్నాయి. వైజాగ్ ని విశ్వనగరంగా మార్చేస్తాం లక్షల ఉద్యోగాలు యువతకి రాబోతున్నాయి. ఇక ఉద్యోగాల్లో చేరడం మీదే ఆలస్యం అంటూ బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఉద్యోగాలు కాదు కాదు, కనీసం హామీల్లో చెప్పిన నిరుద్యోగ బృతి కూడా యువతకి ఇవ్వడం లేదు. ఏమైనా అంటే అమరావతి నిర్మాణం అనే మాట గట్టిగా చెబుతారు. అధికార పార్టీ పద్ధతి ఇలా ఉంటె.

మరో వైపు ఎన్నికల హామీలని నెరవేర్చని టీడీపీని ప్రశ్నించకుండా, ప్రజా సమస్యల మీద కనీసం పోరాటం చేయకుండా ఎలా అయిన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాలు చేస్తూ వాటిని అమలు చేస్తూ, తమని తాము ప్రజలకి పరిచయం చేసుకోవడానికి, ప్రజల మధ్య ఏదో ఒక విధంగా బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబం అంటూ మీ సమస్యలని ఫోన్ చేసి మాకు చెప్పండి, మీము వాటిని అధికారంలోకి వచ్చినాక పరిస్కరిస్తాం అంటూ సరికొత్త పథకం స్టార్ట్ చేసి దాని మీద ప్రజలకి అవగాహన కల్పించే పనిలో ఉండి, రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు.

జగన్ మొదలు పెట్టిన ఈ కుటుంబం స్కీమ్ కి భయపడో, లేక ప్రజలకి తమ మీద విశ్వాసం పోయిందని అర్ధం చేసుకోనో ఇప్పుడు టీడీపీ కూడా ఇంటింటికి టీడీపీ అనే కొత్త స్కీమ్ మొదలు పెట్టి ప్రజలని బుట్టలో ఎసుకునే పని మొదలుపెట్టారు. ఇక రెండు ప్రధాన పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఈ స్కీమ్ ల మాటున అప్పుడే ఎన్నికల ప్రచారానికి తెర తీసారు అనేది ప్రజల మాట. ప్రశాంతంగా మా బతుకులు కూడా మమ్మల్ని బతకనివ్వకుండా ఆ పార్టీ వారు ఒకసారి, ఈ పార్టీ వారు ఒకసారి ఇంటి దగ్గరకి రావడం తమ మీద సడెన్ గా పుట్టుకొచ్చిన ప్రేమతో మభ్య పెట్టె ప్రయత్నం చేయడం చేస్తున్నారు అనేది ప్రజల మాట. అసలు ఇలాంటి ప్రచారాలు ఇప్పుడు అవసరమా, మరో రెండేళ్ళ కాలం ఎన్నికలకి ఉంది, ఈ సమయంలో ప్రజా సమస్యలపై ప్రతి పక్షం పోరాటం వదిలేసి, ప్రజాభివృద్ధి కార్యక్రమాలని అధికార పార్టీ పక్కనే పెట్టేసి ఇలాంటి చవకబారు ప్రచారాలు అవసరమా అనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. మరి వీటికి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆలోచనలు ఏంటి అనేది ప్రజలే తెలుసుకోవాలి అనేది మేధావుల మాట.

  •  
  •  
  •  
  •  

Comments