ఇక మీకో నమస్కారం..బీజేపీ తో టీడీపి కటీఫ్!

Thursday, March 8th, 2018, 04:12:10 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఏపీ కేంద్ర ప్రభుత్వాల మధ్య చిన్న చిన్న అంతర్గత విభేదాలు చెరగుతోన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ అధికారాన్ని దక్కించుకొని కేంద్రం లో గట్టి మద్దతును ఇచ్చింది. కానీ బీజేపీ మాత్రం టీడీపికి ఎటువంటి సహాయాన్ని ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపికి కనీస సహాయాన్ని ఇవ్వలేదు. ఆ బడ్జెట్ పైనే అందరు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే మోడీ ప్రచారం చేసినప్పుడు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపాడు.

కాని ఇప్పుడు మాత్రం బడ్జెట్ పేజీలలో రెండు లైన్ల స్థానాన్ని కూడా ఇవ్వలేదు. పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి రాష్ట్ర మంత్రులు ఎంత ఆందోళన చేస్తోన్న కూడా మోడీ సర్కార్ కనీసం ఆలోచించడం లేదు. అరుణ్ జైట్లీతో సమావేశాలు జరిపినా కూడా లాభం లేకపోయింది. ఆ సమావేశాలకు బీజేపీ అధిపతి అమిత్ షా డుమ్మా కొట్టడం గమనార్హం. రెండు మూడు సమావేశాలకు వచ్చినా కూడా ఏపి నాయకుల గోడును వినిపించుకోలేదు. ప్రత్యేక హోదా ఎలా సాధ్యమవుతుంది అనేలా అరుణ్ జైట్లీ మరో వైపు నుంచి ప్రశ్నలు సంధించారు. నిధులు కేంద్రం వద్ద కూడా లేదు అనేట్లు డైలాగులు వదిలారు. కేవలం స్పెషల్ ప్యాకేజ్ విషయాలలో కొంచెం సహకారం అందిస్తామని చెప్పారు. ఈ విషయాలన్నిటికి విసిగిపోయిన తెలుగు దేశం పార్టీ నేతలు ఫైనల్ గా తెగదెంపులు చేసుకోవడమే కరెక్ట్ అనే విధంగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కూడా ఫైనల్ నిర్ణయాన్ని తీసుకున్నారు.