2019లో టీడీపీకి గ‌డ్డుకాల‌మే!

Tuesday, May 29th, 2018, 03:52:37 AM IST

కుల‌గ‌జ్జితో ఉన్న పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్నంత కుల‌గుల తెలంగానాలో అంత‌గా విస్త‌రించ‌లేద‌నేదీ వాస్త‌వం. క‌మ్మంగా ఉండే కుల క‌మ్మ కులం. అందుకు బ్ర‌హ్మ‌కూడా క‌మ్మంగా ఉండే క‌మ్మ‌వారిని సృష్టించాడ‌ని క‌మ్మ‌స‌మావేశాల్లో కుల‌మ‌త్తుతో జోగుతున్న క‌మ్మ‌వారంద‌రూ చ‌ప్ప‌ట్ల‌తో హోరేత్తించారు.కుల‌పొగ‌డ్త లేని భార‌తీయ స‌మాజాన్ని ఊహించ‌టం క‌ష్ట‌మే. అయితే ఆధునిక భార‌త స‌మాజంలో కూలాన్ని వీడి ముందుకు సాగాల‌ని మొన్న కేర‌ళాలో జ‌రిగిన ఓ స‌ర్వేలో చాలామంది అందుకు అనుకూలంగా ఓటువేయ‌టంతో స‌ర్వ‌త్రా కుల ప్ర‌స్తావ‌న ఓ పెద్ద టాపిక్‌గా మారింది. అక్క‌డ విద్యాసంస్థ‌ల్లో కూడా కులం అనే కాలాన్ని చాలా మంది విద్యార్థులు త‌ల్లిదండ్రులు నిర‌సించ‌టం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేసినా …ఈ కొత్త మార్పుని చాలామంది స్వాగ‌తించారు.

తెలుగుదేశం పెట్టిన కొత్త‌లో ప్ర‌చార‌సాధ‌నాల హ‌డావుడి లేదు.రామోజీ భుజ‌స్కంద‌లపై చాలా సంవ‌త్స‌రాలు న‌డ‌చిన ఆ పార్టీ త‌ర‌వాత కాలంలో వ‌చ్చిన కుల ప‌రిణామాల‌తో పూర్తిగా మారింది. చంద్ర‌బాబుతో నెల‌వంకగా టిడీపీ పార్టీలో ఉన్న కమ్మ‌కులం ప్ర‌స్తుతం నిండుపున్న‌మిలా వెలిగిపోతున్న‌ది. స్థానిక సంస్థ‌ల్లో కుల ప్ర‌తిపాదిక‌న కాకుండా అంద‌రికీ చోటు క‌ల్పిస్తున్న పార్టీ టీడీపీ అని చెప్పుకుంటున్న ప్ర‌తినిధి మంత్రుల స్థాయికి వ‌చ్చే స‌రికి ఆ మాట‌కి విలువ లేకుండా చేసారు. బిసిలకు పెద్ద‌పీట వేస్తూ అప్ప‌టి రాజ‌కీయ ట్రెండ్‌ను తుంగ‌లో తొక్కి కొత్త ర‌క్తంతో టీడీపీని ముందుకు తీసుకెళ్లిన రామారావు ఆ స‌ర‌ళిని మునుముందు కూడా కొన‌సాగించారు. అయితే బాబు రాక‌తో టీడీపీ కుల స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి.కులంపై ప్రేమ వ్య‌క్తితంగా ఉండటం వ‌ల్ల స‌మాజానికి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేదు. పార్టీ పేరుతో కులాన్ని స‌మాజంలో గొప్ప‌గా చిత్రీక‌రిస్తూ పార్టీని కుల పార్టీగా చేయాల‌నుకుంటే వ్య‌క్తులు , స‌మాజ‌శ‌క్తులు దిర‌గప‌డ‌టం త‌థ్యం. కులాల ప్ర‌స్తావ‌న, కులాల చరిత్ర, వాటి స్థితిగ‌తులు పై చ‌రిత్ర‌కారులు శోధించినా ఎక్క‌డ కూడా ఈ క‌మ్మ‌కులానికి సంబంధించిన ఆధారం క్రీస్తు శ‌కంలో క‌న‌ప‌డ‌దు.పైగా రాష్ట్ర‌కూటుల మూలాలు మావే అని వారు చెప్పుకోవ‌టం ..గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణీ సినిమాలానే ఉంటుంది. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తూ రాసే ఏ రాత కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేదు.

న‌టుడు, నిర్మాత‌,వ్యాపార‌వేత్త‌,ఎంపీ,టీడీపీ ఆస్థానంలో శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌లిగిన ముర‌ళీమోహ‌న్ మొన్నజారిన నోటిమాట కాస్తా వివాదాన్ని రేపింది. వెంక‌న్న చౌద‌రి….పేరు ఉండొచ్చు. అయితే ఆయ‌న అలా ఎవ‌రిని పిలిచాడో తెలిసి….అంద‌రూ అవాక్క‌య్యారు. ఎన్నో పురాణాల సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఎన్‌టిఆర్ ఎక్క‌డ కూడా తన కులాన్ని ఉటంకించ‌లేదు. ద‌శ‌వ‌తారాల్లో ….ఒక్కొక్క అవ‌తారానికి ఒక్కొక్క కులానికి చెందిన వాడిగా దేవుడిని ఏ గంథ్రాల్లో కూడా చిత్రీక‌రించ‌లేదు. నోటినుండి వ‌చ్చిన మాటని వెన‌క్కి తీసుకుని ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పినా…. సోష‌ల్‌మీడియా పుణ్య‌మాని అది పెద్ద హ‌ల్‌చ‌ల్ అయింది. ఒక్క‌కుల ఓటుతో , ఒక మ‌తం ఓటుతో గెలిచే నాయ‌కుల కాలం కాదిది. అనాదిగా భార‌తీయ స‌మాజంలో కుల‌పాత్ర ఉన్న నేటి స‌మాజానికి అది చెప్పుకోవ‌టానికి త‌ప్పించి …దానివ‌ల్లే ప‌నులు జ‌రుగుతాయి అనుకోవ‌టం మూర్ఖ‌త్వ‌మే.

  •  
  •  
  •  
  •  

Comments