ఎన్డీయే నుండి టిడిపి వైదొలగి తప్పు చేసింది : కేంద్ర మంత్రి

Wednesday, May 30th, 2018, 12:00:55 PM IST

విభజన హామీలు, అలానే ప్రత్యేక హోదాపైగత ఎన్నికల్లో మాటిచ్చిన మోడీ మాట తప్పారని, బిజెపి వైఖరి పై నిరసన వ్యక్తం చేసి ఆపై ప్రత్యేక ప్యాకెజీ వస్తోంది, హోదావల్ల కలిగే లాభాలకంటే ఎక్కువగా ప్యాకెజీ ద్వారా మీకు లభిస్తాయని బిజెపి మోసం చేసిందని, మోడీ చెప్పినది ఒకటి చేసినది ఒకటని టీడిపి పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈ విషయమై చేసిన అన్యాయం వల్ల ఇకపై ఎన్డీయేలో ఇక భాగస్వాములుగా కొనసాగలేమని తెగతెంపులు చేసుకుంది. అయితే నేడు ఈ విషయమై విజయవాడ విచ్చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. అసలు టీడీపీ పార్టీ చేసింది అనాలోచిత పని అని, 2014లో హోదా ఇస్తామన్న వాస్తవమే అయినప్పటికీ దానికి సమానంగా నిధుల కేటాయింపులు చేపట్టినట్లు అయన తెలిపారు. అంతేకాక ఇప్పటికే చెప్పినవాటిలో చాలావరకు తమ ప్రభుత్వం చేసిందని, ఈ విషయమై మోడీని కానీ, బిజెపిని కానీ తప్పుపట్టవలసిన అవసరం లేదని అన్నారు.

నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే రేవు మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వవలసి వస్తుందని, ఇదివరకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఏమి ఇవ్వలేదని, అభివృద్ధి ప్రాతిపదికన నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ద్వారా అన్ని లాభాలు పొంది చివరకు తమను నిందించి ఎన్డీయే నుండి వైదొలగి పెద్ద తప్పు చేసిందని అన్నారు. అలానే పోలవరం ఆలస్యానికి కూడా కేంద్రం కారణం కాదని, ఇక్కడి రాష్ట్రప్రబుత్వం అవలంబిస్తున్న అనాలోచిత పద్ధతులవల్లనే అది మరింత ఆలస్యం అవుతోందని అన్నారు. వినియోగ పాత్రలపై టీడీపీ అంత బహిరంగంగా మాట్లాడినపుడు దానికి ప్రతిగా అమిత్ షా సమాధానం చెపితే తప్పేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా బిజెపి నేతలపై టీడీపీ వారు చేస్తున్న దాడిని ఆపి, ఏపీ కి జరిగిన లాభాలపై నిజానిజాలు చంద్రబాబు, టీడీపీ నేతలు బయటపెట్టాలని ఆయన కోరారు……

  •  
  •  
  •  
  •  

Comments