టీడీపీకి ఊహించ‌ని షాక్.. వైసీపీలో టీడీపీ మాజీ అధ్యక్షుడు..!

Monday, November 19th, 2018, 11:24:39 AM IST

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా వైసీపీ దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌లోని అన్ని జిల్లాల్లో పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌య‌త్రం తాజాగా 300రోజులు కంప్లీట్ చేసుకుంది. ప్ర‌స్తుతం విజ‌య‌నగ‌రంలో జ‌గ‌న్ పాద‌య‌త్ర చేస్తుండ‌గా.. అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి ప‌లువురు నేత‌లు ఆ పార్టీలో చేరుతున్నారు. ఇక ఇప్ప‌టికే కాంగ్రెస్ మాజీ మంత్రి వైసీపీలో చేర‌గా.. తాజాగా టీడీపీ నేత‌లు వైసీపీలో చేరారు.

రాజ‌మండ్రి రూర‌ల్‌కు చెందిన ప‌లువురు టీడీపీ నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొల‌మూరు పంచాయ‌తీ ప‌రిదిలో గ‌ల కుంత‌మూరుకు చెందిన టీడీపీ మాజీ అధ్య‌క్షుడు కంటిపూడి బలరామకృష్ణచౌదరి, తాజాగా వైసీపీలో చేర‌డంతో రాజ‌కీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆయ‌న‌తో పాటు ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు వైసీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ళుగా టీడీపీకి సేవ‌లు చేసినా.. త‌మ‌కు స‌రైన గుర్తింపు ద‌క్క‌డం లేద‌ని, కాసులు ఉన్న వారికే టీడీపీ అధిష్టానం ప‌దవులు ఇస్తోంద‌ని, త‌మ‌ని క‌నీసం ప‌రిగణ‌లోకి కూడా తీసుకోవ‌డం లేద‌ని, అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌తో క‌లిసి న‌డ‌వ‌డానికి వైసీపీలో చేరుతున్నామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకు త‌మ‌వంతుగా కృషి చేస్తామ‌ని అన్నారు. దీంతో ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఇలా దిగువ శ్రేణి నాయ‌కులు వైసీపీలో చేర‌డం.. టీడీపీకి పెద్ద షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.