ఆంధ్రుల వ్యతిరేకి – జగన్ పై కొత్త ప్రచారం..!

Tuesday, October 30th, 2018, 01:40:00 PM IST

జగన్ పై దాడి కేసులో టీడీపీ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యం లో, ఆ అంశం మీద నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ బాగానే ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రుల వ్యతిరేకి అంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. తనపై దాడి జరిగిన కేసులో ఏపీ పోలీసులకువాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ నిరాకరించిన సంగతి తెలిసిందే, అయితే దానికిగాను అయన కారణాలు ఆయనకున్నాయి. అప్పటికే ముఖ్యమంత్రి మొదలుకొని ముఖ్య నేతలు, డీజీపీ వంటి ఉన్నత అధికారులు ఏకమై జగన్ కేసుని నీరుగార్చారు. పోలీసులు ఎలా దర్యాప్తు చేయాలో కూడా హింట్ ఇస్తూ ముందే ప్రకటన విడుదల చేసారు, జగన్ తనంతట తానె తనపై దాడి చేయించుకున్నారని, నిందితుడు జగన్ అభిమాని అంటూ సీన్ క్రీస్తే చేసారు. దీంతో వైసీపీ నాయకులూ ఆగ్రహించారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వం కేసును పక్కదోవ పట్టిస్తోందని, ఏపీ పోలీస్ వ్యవస్థ పై తనకు నమ్మకం లేదని జగన్ వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు, ఇదే అదునుగా టీడీపీ నాయకులూ “జగన్ ఆంధ్రుల వ్యతిరేకి” అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.

జగన్ వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించిన సందర్భం, అయన చెప్పిన కారణాన్ని పక్కనపెట్టి , జగన్ కు వ్యతిరేకంగా ప్రచారానికి తేర లేపాయి టీడీపీ శ్రేణులు. జగన్ ఏపీ అంటే ఇష్టం లేనప్పుడు పాదయాత్ర చేయటం ఎందుకు అని, జగన్ కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అవసరమా అని విమర్శిస్తున్నారు. ఏకంగా జగన్ ఆంధ్రుల ద్రోహి అని విమర్శించేంత స్థాయికి వెళ్లారు. ఏదైనా కేసులో బాధితుడు తనకు నచ్చిన ఏజెన్సీ చేత విచారణ చేయించామని కోరే హక్కు సామాన్యభారత పౌరుడి గా జగన్ కు ఉందన్న విషయం టీడీపీ నాయకులు మర్చిపోతున్నారు. ఇదే రకంగా జగన్ పై ప్రచారం కొనసాగితే అటు జగన్ కు, ఇటు వైసీపీ కి తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం లో టీడీపీ ని ఖండించేందుకు ఒక్క వైసీపీ నాయకుడు కూడా రాకపోవటం గమనార్హం. టీడీపీ పనికట్టుకు తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్న నేపథ్యం లో వైసీపీ దీన్ని ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.