రాస్కో సాంబా ఏపీలో టీడీపీ ఖ‌తం!?

Tuesday, November 6th, 2018, 02:51:46 PM IST

రానున్న ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అడ్ర‌స్ లేకుండా పోతుంది… కావాలంటే రాస్కోండి… అని టీడీపీపై తెరాస నేత హ‌రీష్‌రావు షాకింగ్ కామంట్స్ చేశారు. గ‌త కొంత కాలంగా చంద్ర‌బాబు చేస్తున్న మోసాల్ని ఏపీ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని, ఈ సారి త‌మ స‌త్తా ఏంటో చూపించి చంద్ర‌బాబును మ‌ట్టి క‌రిపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవిత‌మే మోసాల పుట్ట అని, అత‌ని ప్ర‌తి అడుగూ, ప్ర‌తి క‌ద‌లిక‌, ప్ర‌తి మాట మోస‌మేన‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అమ‌రావ‌తికి కార్పొరేట్ క‌ల‌రింగ్ ఇస్తున్న చంద్ర‌బాబు అక్క‌డి ప్ర‌జ‌లకు మ‌సిపూసి మోసం చేస్తున్నార‌ని, ఇప్ప‌టి కిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు పెడితే చంత్ర‌బాబు చిత్తుచిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ.. కావాలంటే రాస్కోండి!! అని స‌వాల్ చేశారు హ‌రీష్‌రావు. పేదోడి క‌డుపు నింప‌డం అటుంచి కంప్యూట‌రే స‌ర్వం అన్న‌ట్లుగా వ్వ‌వ‌హరించే హైటెక్ సీఎంను ఆంధ్రా ప్ర‌జ‌లు న‌మ్మే రోజులు లేవ‌ని, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభ‌జించింద‌ని దారుణ‌మ‌ని విమ‌ర్శంచిన చంద్ర‌బాబు ఇప్ప‌డు అదే పార్టీ కాళ్లు ప‌ట్టుకోవ‌డం ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు ఆ త‌ర‌వాత తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌డానికి భ‌య‌ప‌డ్డాడ‌ని, త‌న‌కు ఎదురు తిరిగాడ‌న్న కోపంతో మోడీ ఎక్క‌డ ఓటుకు నోటు కేసుని బ‌య‌టికి తీస్తాడ‌న్న భ‌యంతోనే జాతీయ కూట‌మి పేరుతో కాంగ్రెస్ కాళ్లు ప‌ట్టుకుంటున్నాడ‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హ‌రీష్ విమ‌ర్శ‌ల‌పై టీడీపీశ్రేణులు ఎలా ఎదురుదాడికి దిగుతాయో చూడాలి. ఓవైపు ఏపీలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తాట తీస్తుంటే, మ‌రోవైపు తెలంగాణ‌లో తేరాస నాయ‌కులు చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర స‌మీకర‌ణాల‌కు తావిస్తోంది.