జగన్ పై బీకామ్ లో ఫిజిక్స్ అంకుల్ సంచలన వ్యాఖ్యలు

Thursday, April 26th, 2018, 03:50:54 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరో సారి తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న జలీల్‌ఖాన్‌ మాట్లాడుతూ జగన్ ను ప్రశ్నించారు.

బీజేపీతో వైసీపీ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నదని అయన ఆరోపించారు. అలాగే ఇంకా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు.

అలాగే నరేంద్రమోదీ మోదీ మోసాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. జగన్ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments