టీడీపీకి మైండ్‌బ్లోయింగ్ షాక్.. వైసీపీలోకి ప్రముఖ నేత‌..?

Monday, November 12th, 2018, 01:51:22 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారా మొగ‌నున్న నేప‌ధ్యంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ ఫుల్ జోష్‌తో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో అనేక‌మంది నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్ర‌మంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తూర్పుగోదావ‌రి టీడీపీకి చెందిన ముఖ్యనేత వైసీపీలో చేర‌నున్నార‌ని రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్తలు హాల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప్ర‌ముఖ బీసీ నేత మార్గాని నాగేశ్వ‌ర‌రావు వైసీపీలో చేర‌నున్నార‌నే టాక్ వినిపిస్తుంది. గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన మార్గాని నాగేశ్వ‌ర‌రావు అత‌ని కొడుఉ భ‌ర‌త్ ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్నారు. అయితే కొద్ది కాలంగా మార్గాని టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లకు నెలు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో.. ఇటీవ‌ల వైసీపీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యార‌ని.. తాను అడిగిన స్థానంలో టిక్కెట్టు ఇవ్వ‌డానికి వైసీపీ అదినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని.. దీంతో రెండు, మూడు రోజుల్లో మార్గాని వైసీపీలో చేర‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి నిజంగానే మార్గాని నాగేశ్వ‌రరావు వైసీపీలో చేరితే టీడీపీకి పెద్ద షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.